Viral Video : కోహ్లీ అనుకుని కోహ్లీ డూప్‌తో ఫోటోలకు ఎగబడ్డ జనాలు

విరాట్ కోహ్లీ అనుకుని జనం వెంటపడ్డారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కట్ చేస్తే ఏం జరిగిందో మీరే చూడండి.

Viral Video : కోహ్లీ అనుకుని కోహ్లీ డూప్‌తో ఫోటోలకు ఎగబడ్డ జనాలు

Viral Video

Updated On : January 23, 2024 / 1:19 PM IST

Viral Video : మనుష్యుల్ని పోలిన మనుషులు చాలామంది ఉంటారు. వాళ్లని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలిన ఒక వ్యక్తిని చూసి కోహ్లీ అనుకున్నారు జనమంతా.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ సంఘటన అయోధ్యలో జరిగింది.

David Warner : అయోధ్య రామ మందిర వేడుకపై పాకిస్తాన్, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్స్ పోస్ట్..

అయోధ్యలో విరాట్ కోహ్లీ అనుకుని ఒక వ్యక్తిని చుట్టుముట్టారు జనాలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మలకు ఆహ్వానం అందింది. కానీ వారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే కోహ్లీ పోలికలతో కనిపించిన వ్యక్తితో ఫోటోలు దిగడానికి  జనం ఎగబడటం వైరల్‌గా మారింది. కోహ్లీని పోలిన వ్యక్తి పేరు పీయుష్ రాయ్ అని తెలుస్తోంది. అచ్చంగా కోహ్లీలాగ అతను కనిపించడమే కాదు.. తయారవ్వడం కూడా అందుకు కారణం కావచ్చు అనిపిస్తోంది.

Shakib Al Hasan : బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన క్రికెటర్.. అభిమానిని కొట్టిన వీడియో వైరల్

మరోవైపు జనవరి 25న ఇంగ్లాండ్‌పై హైదరాబాద్‌లో జరగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండు టెస్ట్‌లకు కోహ్లీ హాజరు కావడం లేదు. దీనిపై కారణాల కోసం ఊహాగానాలు చేయడం మానుకోవాలని, కోహ్లీ ప్రైవసీని గౌరవించాలని BCCI అభిమానులను కోరింది. త్వరలో కోహ్లీ ప్రత్యామ్నాయంగా మరో క్రికెటర్ పేరు ప్రకటిస్తామని తెలిపింది. టెస్ట్ సిరీస్‌లో సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టుకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని బీసీసీఐ కార్యదర్శి జే షా ఒక ప్రకటనలో చెప్పారు.