Shakib Al Hasan : బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన క్రికెటర్.. అభిమానిని కొట్టిన వీడియో వైరల్

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో మగురా-1 పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్ పై ..

Shakib Al Hasan : బంగ్లాదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన క్రికెటర్.. అభిమానిని కొట్టిన వీడియో వైరల్

Shakib Al Hasan

Bangladesh cricket captain Shakib Al Hasan : బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో మరోసారి షేక్ హసీనా పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వరుసగా నాలుగోసారి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అధికార పీఠాన్ని చేపట్టబోతోంది. అవామీ లీగ్ పార్టీ మూడింట రెండొంతుల స్థానాలను దక్కించుకుంది. బంగ్లాదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ, దాని మిత్రపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో ఆ పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నాయి. దీంతో మొత్తం 300 స్థానాలకుగాను 299 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 200 స్థానాల్లో అనామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో విజయంతో 76ఏళ్ల షేక్ హసీనా వరుసగా ఐదోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు.

Also Read : MP Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన.. కార్పొరేటర్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్న శ్వేత

బంగ్లా క్రికెటర్ విజయం..
ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ క్రికెటర్ ఘన విజయం సాధించారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మగురా-1 పార్లమెంట్ సీటుకు పోటీచేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్ పై 1,50,000 ఓట్ల తేడాతో షకీబ్ హసన్ విజయం సాధించాడు. ఎన్నికల ప్రచారంకోసం హసన్ క్రికెట్ కు కొంతకాలం విరామం తీసుకున్నాడు. విజయం తరువాత షకీబ్ హసన్ మాట్లాడుతూ.. పోటీ, సవాళ్లు ఎప్పుడూ ఉంటాయి.. అది చిన్న జట్టు అయినా, పెద్ద జట్టైనా అంటూ పేర్కొన్నాడు. షకీబ్ చివరిసారిగా భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడాడు. ప్రపంచ కప్ తరువాత బంగ్లాదేశ్ రెండు వేర్వేరు పర్యటనల్లో న్యూజిలాండ్ తో తలపడింది. ఒకటి స్వదేశంలో, మరొకటి బయట. అయితే, షకీబ్ ఈ మ్యాచ్ లలో భాగస్వామ్యం కాలేదు.

Also Read : Congress Party : టార్గెట్ లోక్‌స‌భ‌ ఎలక్షన్స్.. తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి.. కో-ఆర్డినేటర్ల నియామకం

అభిమానిని కొట్టిన వీడియో వైరల్..
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తన దేశంలో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించాడు. 1.50లక్షల ఓట్ల భారీ మెజార్టీ విజయం సాధించాడు. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువకముందు అతను ఓ అభిమానిపై చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షకీబ్ ఓ పోలింగ్ స్టేషన్ వద్ద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లాడు. భారీ సంఖ్యలో అభిమానులు అతన్ని చుట్టుముట్టారు. వీరిలో ఓ అభిమాని షకీబ్ అల్ హసన్ వద్దకు వెళ్లాడు. ఆ తరువాత అతనిపై చేయివేసేందుకు ప్రయత్నించడంతో.. షకీబ్ అల్ హసన్ సదరు అభిమానిని చెంప చెళ్లుమనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.