Congress Party : టార్గెట్ లోక్‌స‌భ‌ ఎలక్షన్స్.. తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి.. కో-ఆర్డినేటర్ల నియామకం

తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏపీలో 25పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ..

Congress Party : టార్గెట్ లోక్‌స‌భ‌ ఎలక్షన్స్.. తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి.. కో-ఆర్డినేటర్ల నియామకం

Congress Party

Updated On : January 8, 2024 / 8:21 AM IST

Lok Sabha elections 2024 : పార్లమెంట్ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈదఫా ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై కేంద్ర పార్టీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నియమించింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించింది. ఈ కమిలో రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 25 మంది ఉన్నారు. మరో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కో-ఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.

Also Read : Kishan Reddy: లక్షద్వీప్‌ ఉండగా ఈ దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు: వివాదంపై కిషన్ రెడ్డి

తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏపీలో 25పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా తెలంగాణలో 17 నియోజకవర్గాలపై కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

Also Read : #BoycottMaldives : బాయ్‌కాట్ మాల్దీవ్స్‌.. ఇండియాలో ఇప్పుడిదే ట్రెండింగ్ ఇష్యూ.. రంగంలోకి సెలబ్రిటీలు

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఏఐసీసీ నియమించిన కో-ఆర్డినేటర్లు వీరే..
అదిలాబాద్ (ఎస్టీ) – డి. అనసూయ (సీతక్క)
పెద్దపల్లి (ఎస్సీ) – డి. శ్రీధర్ బాబు
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ – టి. జీవన్ రెడ్డి
జహీరాబాద్ – పి. సుదర్శన్ రెడ్డి
మెదక్ – దామోదర్ రాజనర్సింహ
మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు
సికింద్రాబాద్ – మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ – మల్లు భట్టి విక్రమార్క
చేవెళ్ల – రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్ – రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ (ఎస్సీ) – జూపల్లి కృష్ణారావు
నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి – కోమిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్ (ఎస్సీ) – కొండా సురేఖ
మహబూబాబాద్ (ఎస్టీ) – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు ఏఐసీసీ నియమించిన కో-ఆర్డినేటర్లు వీరే..
ఏలూరు – కనుమూరి బాపిరాజు
రాజంపేట – డాక్టర్ ఎన్. తులసిరెడ్డి
అరకు (ఎస్టీ) – జగతా శ్రీనివాస్
శ్రీకాకుళం – మీసాల సుబ్బన్న
విజయనగరం – బొడ్డేపల్లి సత్యవతి
విశాఖ -కొత్తూరి శ్రీనివాస్
అనకాపల్లి – సనపాల అన్నాజీరావు
కాకినాడ – కేబీఆర్ నాయుడు
అమలాపురం (ఎస్సీ) – ఎం. వెంకట శివప్రసాద్
రాజమండ్రి – ముషిని రామకృష్ణ
నరసాపురం – జెట్టి గురునాథరావు
మచిలీపట్నం – కొరివి వినయ్ కుమార్
విజయవాడ – డి. మురళీ మోహన్ రావు
గుంటూరు – గంగిశెట్టి ఉమాశంకర్
నరసరావుపేట – వి. గురునాథం
బాపట్ల (ఎస్సీ) – శ్రీపతి ప్రకాశం
ఒంగోలు – యు. వెంకటరావు యాదవ్
నంద్యాల – బండి జకారియా
కర్నూలు – పి.ఎం. కమలమ్మ
అనంతపురం – ఎన్.శ్రీహరి ప్రసాద్
హిందూపురం – షేక్ సత్తార్
కడప – ఎం. సుధాకర్ బాబు
నెల్లూరు – ఎం. రాజేశ్వరరావు
తిరుపతి (ఎస్సీ) – షేక్ నాజర్ అహ్మద్
చిత్తూరు (ఎస్సీ) – డి. రాంభూపాల్ రెడ్డి