MP Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన.. కార్పొరేటర్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్న శ్వేత

విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

MP Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన.. కార్పొరేటర్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్న శ్వేత

MP Kesineni Nani

Kesineni Swetha : విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధిష్టానంకు మరో షాకిచ్చారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్ సభ సభ్యత్వంతో పాటు, తెలుగుదేశం పార్టీకిసైతం రాజీనామా చేస్తానని కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం మరో సంచలన ట్వీట్ చేశారు. తన కుమార్తె శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తుందని వెల్లడించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు తన కూతురు కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, రాజీనామా ఆమోదం పొందిన తరువాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని కేశినేని నాని చెప్పారు.

Also Read : TDP MP Kesineni Nani : ఎంపీ టికెట్ ఇవ్వకపోతే అక్కడే కూర్చుని సేవచేస్తా : కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించారు. కేశినేని నాని నిర్ణయంతో ఈరోజు కార్పొరేటర్ పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 8:30 గంటలకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయానికి వెళ్లి గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు చెబుతారు. ఉదయం 9 గంటలకు కార్పొరేషన్ పరిధిలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతారు. 10:30 గంటలకు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికివెళ్లి మేయర్, మున్సిపల్ కమిషనర్ ను కలిసి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా ఇచ్చి ఆమోదింప చేయాలని కోరనున్నారు.

Also Read : Kesineni Nani: ఎన్నికల వేళ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్‌ షాక్

ఇప్పటికే తన పార్లమెంట్ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని చెప్పిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీవెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ తరువాత టీడీపీ సభ్యత్వానికికూడా రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువూరులో జరిగిన ‘రా కదిలిరా’ కార్యక్రమానికి దూరంగా ఉండాలని తనను పార్టీ ఆదేశించినట్లు కేశినేని నాని ఇటీవల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా వేరేవ్యక్తిని చూస్తున్నట్లు పార్టీ అధిష్టానం తనతో చెప్పినట్లు ప్రకటించిన కేశినేని నాని, విజయవాడలోని కేశినేని భవన్ దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాలనుసైతం తొలగించారు.

Also Read : Congress Party : టార్గెట్ లోక్‌స‌భ‌ ఎలక్షన్స్.. తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి.. కో-ఆర్డినేటర్ల నియామకం

ఆదివారం కేశినేని నానితో టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశం అయ్యారు. దాదాపు గంటకుపైగా వీరిమధ్య చర్చలు కొనసాగాయి. టీడీపీ అధిష్టానం నానిని బుజ్జగించేందుకు కనకమేడలను పంపించినట్లు ప్రచారం జరిగింది. అయితే, కేశినేని నాని మాత్రం ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేయాలనే నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే ఆదివారం తిరువూరులో సభ జరిగింది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొనాలని నానికి ఆహ్వానంసైతం అందించారు. దీనికితోడు సభలో నానికోసం ప్రత్యేక సీటుకూడా కేటాయించారు. సభలో సీటు కేటాయించడంపై నాని స్పందించారు. తాను పార్టీనే వద్దనుకున్న తరువాత ఇక ప్రొటోకాల్ ఏంటని తెలిపారు. అందులో భాగంగానే సభకు కూడా హాజరు కాలేదని చెప్పారు. అయితే, కేశినేని నాని త్వరలో జరిగే ఎన్నికలకు దూరంగా ఉంటారా? లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? వేరే పార్టీలో చేరుతారా అనే విషయంపై ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే, సంక్రాంతి లేదా ఫిబ్రవరిలోఎంపీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన తరువాత నాని తన నిర్ణయాన్ని వెల్లడిస్తారనే ప్రచారం జరుగుతుంది.