David Warner : అయోధ్య రామ మందిర వేడుకపై పాకిస్తాన్, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్స్ పోస్ట్..

అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైన వేళ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెటర్లు ఈ వేడుకపై పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

David Warner : అయోధ్య రామ మందిర వేడుకపై పాకిస్తాన్, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్స్ పోస్ట్..

David Warner

David Warner : అంగరంగ వైభవంగా అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకపై అనేకమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా ఈ వేడుకపై పాకిస్తాన్, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు కూడా స్పందించడం వైరల్‌గా మారింది.

PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ముస‌లం? పీసీబీ ఛైర్మన్‌ పదవికి జకా అష్రఫ్‌ రాజీనామా..

అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రం ముగిసిన తర్వాత అనేకమంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. వీరిలో విదేశీయులు కూడా ఉండటం విశేషం.  ఈ వేడుకపై పాకిస్తాన్‌కు చెందిన క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. రాముడు అయోధ్యకు తిరిగి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు. తన ట్విట్టర్ ఖాతాలో ‘శతాబ్దాల నిరీక్షణ ముగిసింది.. ప్రతిజ్ఞ నెరవేరింది.. ప్రాణ ప్రతిష్ట పూర్తైంది’ అంటూ పోస్టు చేసారు.

ఇటీవలే టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘జై శ్రీరామ్ ఇండియా’ అంటూ పోస్టు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై గతంలో కూడా వార్నర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా భారతీయ సినిమా పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు పోస్టు చేసారు. కొన్ని ఫేమస్ సినిమాలలోని డైలాగ్స్‌తో వీడియోలు చేస్తూ ఇండియన్ యాక్షన్ సినిమాలపై తన ప్రేమను చాటుకున్నారు.

Ishan Kishan : దేశ‌వాలీ క్రికెట్ ఆడాల‌ని ద్ర‌విడ్ చెప్పిన త‌రువాత‌.. ఇషాన్ కిష‌న్ రియాక్ష‌న్ ఇదే..!

హిందూ కుటుంబానికి చెందిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా ఈ సందర్భంలో తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ‘జై శ్రీరామ్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసారు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన రామ మందిర ప్రారంభోత్సవంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)