IND vs ENG : ఉప్ప‌ల్‌లో టీమ్ఇండియా గెల‌వాలంటే.. రోహిత్ శ‌ర్మ ఈ ప‌ని చేయాల్సిందే..

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు భార‌త్‌ సన్న‌ద్ద‌మ‌వుతోంది.

IND vs ENG : ఉప్ప‌ల్‌లో టీమ్ఇండియా గెల‌వాలంటే.. రోహిత్ శ‌ర్మ ఈ ప‌ని చేయాల్సిందే..

Sunil Gavaskar Advice For Rohit Sharma Ahead Of England Tests

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను 3-0 క్లీన్ స్వీప్ చేసిన భార‌త జ‌ట్టు ఇప్పుడు మ‌రో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సన్న‌ద్ద‌మ‌వుతోంది. ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌న‌వ‌రి 25 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-2025 సైకిల్‌లో భార‌త్ ఫైన‌ల్ చేరుకోవాలంటే ఇంగ్లాండ్ సిరీస్ చాలా కీల‌కంగా మారింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఉప్ప‌ల్ మైదానానికి చేరుకున్న ఇరు జ‌ట్లు ప్రాక్టీస్ మొద‌లు పెట్టేశాయి.

గురువారం నుంచి ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియా ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రిస్తే ఈ మ్యాచ్‌లో గెలుస్తుంద‌నే విష‌యాన్ని దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ వెల్ల‌డించాడు. ఈ క్ర‌మంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మకు ప‌లు సూచ‌న‌లు చేశాడు. ఉప్ప‌ల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవ‌కాశాలు త‌క్కువ అని, అందుక‌నే హిట్‌మ్యాన్ త‌న బౌల‌ర్ల‌ను చాలా తెలివిగా రొటేట్ చేసుకోవాల‌ని సూచించాడు.

Glenn Maxwell : త‌ప్ప‌తాగి ప‌డిపోయిన మాక్స్‌వెల్‌..! అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు..!

ఒక‌వేళ ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసి శుభారంభాన్ని అందుకుంటే అప్పుడు రోహిత్ శ‌ర్మ త‌న బౌల‌ర్ల‌ను ఎలా వినియోగించుకుంటాడో చూడాల్సి ఉంద‌న్నాడు. గ‌త ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో చెన్నైలో జ‌రిగిన మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు అనుకూలింది. అలాంటి కండిష‌న్స్‌లో రోహిత్ శ‌ర్మ అద్భుత సెంచ‌రీ న‌మోదు చేశాడు. స్పిన్ పిచ్‌ల‌పై ఎలా బ్యాటింగ్ చేయాలో అత‌డు మిగ‌తా వారికి చూయించాడ‌న్నారు.

ఇప్పుడు కూడా రోహిత్ ఓపెన‌ర్‌గా శుభారంభాల‌ను అందిస్తే ఆ త‌రువాత బ్యాటింగ్‌కు వ‌చ్చే వారు స్వేచ్ఛ‌గా ప‌రుగులు సాధిస్తార‌ని చెప్పారు.

ఉప్ప‌ల్‌లో భార‌త్‌కు ఘ‌న‌మైన రికార్డు..

ఇదిలా ఉంటే.. తొలి టెస్టుకు వేదికైన ఉప్ప‌ల్‌లో టీమ్ఇండియాకు అద్భుత రికార్డు ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్టేడియంలో భార‌త జ‌ట్టు ఐదు టెస్టు మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కాగా.. ఈ గ్రౌండ్ లో మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ, పుజారాలు ఆడ‌డం లేదు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ మ్యాచ్‌కు విరాట్ దూరంగా ఉండ‌గా.. పుజ‌రాను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌లేదు.

Ashwin : అరుదైన రికార్డుకు చేరువ‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. ఉప్ప‌ల్‌లోనే అందుకుంటాడా..?