దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు పేలవంగానే ముగిసింది. భారీ అంచనాలతో మొదలుపెట్టిన 4×400 మిక్స్‌డ్ రిలే టీమ్ అద్భుతం చేయలేకపోయింది. ఫైనల్లో బ్రెజిల్‌పై పై చేయి సాధించి 3 నిమిషాల 15:77 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచింది. తొలిసారి ఈ మెగా టోర్నీలో ప్రవేశపెట్టిన మిక్సడ్‌రిలేలో భారత్‌కు మొహమ్మద్ అనస్, వీకే విస్మయ, జిస్నా మాథ్యు, నిర్మల్ నోహ్ ప్రాతినిధ్యం వహించారు.
వాళ్ల స్థాయి ప్రదర్శన చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. హీట్స్‌లో 3 నిమిషాల 16.14సెకన్ల టైమింగ్‌తో రాణించింది భారత బృందం. పోటీల్లో అమెరికా జట్టు 3 నిమిషాల 09:34 సెకన్లతో అగ్రస్థానంలో నిలవడంతో స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత జమైకా టీమ్ 3నిమిషాల 11:78 సెకన్లతో రజతాన్ని, బహ్రెయిన్ టీమ్ 3నిమిషాల 11:82 సెకన్లతో కాంస్యాన్ని దక్కించుకున్నాయి.
సోమవారం జరగనున్న జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ ఏ, బీ.. ఈవెంట్‌లో భారత్ నుంచి అన్నూ రాణి (రాత్రి 7గంటలకు క్వాలిఫికేషన్ గ్రూప్ ఏ; రాత్రి 8గంటల 30నిమిషాలకు; క్వాలిఫికేషన్ గ్రూప్ బీ), మహిళల 200మీ. హీట్స్‌లో అర్చన సుసీంత్రన్ (రాత్రి 7గంటల 35నిమిషాలకు), 400మీ. హీట్స్‌లో అంజలి దేవీ (రాత్రి 8గంటల 50నిమిషాలకు)తలపడతారు.