Temba Bavuma : కెప్టెన్సీడే లో నిద్రపోతున్న దక్షిణాఫ్రికా కెప్టెన్.. జో జో లాలీ అంటున్న నెటిజన్లు..!
నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్సీ డే నిర్వహించారు. ప్రపంచకప్‌లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్లు ఈ కెప్టెన్సీ మీట్ ఈవెంట్‌కు హాజరు అయ్యారు.
- Thota Vamshi Kumar
- Updated on- October 4, 2023 / 05:25 PM IST
Temba Bavuma Falls Asleep
Temba Bavuma Falls Asleep : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడింది. గురువారం (అక్టోబర్ 5) నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ ప్రారంభానికి ఒక్క రోజు ముందు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్సీ డే ను నిర్వహించారు. ప్రపంచకప్‌లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్లు ఈ కెప్టెన్సీ మీట్ ఈవెంట్‌కు హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా విలేకరులు ఒక్కొ జట్టు కెప్టెన్‌ను ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే.. ఈ సమయంలో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా కాసేపు కునుకు తీశాడు. అతడు నిద్రపోతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచకప్ ఆడేందుకు వచ్చావా..? నిద్రపోవడానికి వచ్చావా..? అని ఓ నెటీజన్ కామెంట్ చేయగా, పాపం మ్యాచ్ ఆడి అలసిపోయినట్లుగా ఉన్నాడు అంటూ మరో నెటీజన్ కామెంట్ చేశాడు.
అయితే.. ఇక్కడ దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమాను నిందించాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుతో పాటు కలిసి వచ్చిన అతడు వార్మప్ మ్యాచులకు ముందు వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. సౌతాఫ్రికా జట్టు వార్మప్ మ్యాచులు ఆడి మొదటి మ్యాచ్ కోసం ఢిల్లీకి వెళ్లగా అతడు కెప్టెన్ల మీట్లో పాల్గొనేందుకు నేరుగా అహ్మదాబాద్‌కు వచ్చాడు. మిగతా కెప్టెన్లు అందరూ ఇద్దరు చొప్పున సోఫాల్లో కూర్చోగా, బావుమా మాత్రం ఒక్కడే ఛైర్లో కూర్చోన్నాడు. ఒక్కడే కావడంతో హ్యాపీగా నిద్ర పోయాడు.
ఐపీఎల్ అనుభవం అక్కరకొస్తుంది..
ఇక ఈ మీట్లో బావుమా మాట్లాడుతూ.. చాలా మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడారు. దీంతో భారత్‌లోని పిచ్‌లపై వారికి ఓ అవగాహన ఉంది. ఈ అనుభవంతో వన్డే ప్రపంచకప్‌లో వారు రాణిస్తారు అన్న ధీమాను వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ గెలిచేందుకు శాయశక్తుల కృషి చేస్తామని బావుమా చెప్పాడు.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. మొత్తం 10 జట్లు కప్పు కోసం పోటీ పడుతున్నాయి. దక్షిణాఫ్రికా జట్లు తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 7న శ్రీలంకతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
వేదికపై బావుమా చేసిన పనిపై కొన్ని ఫన్నీ రియాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి:
