Rohit Sharma : కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. 26 లేదా 27 ఏళ్ల వయసులో కెప్టెన్ అయి ఉంటే..?
రోహిత్ తన కెరీర్‌లో చాలా ఆలస్యంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతడి సారథ్యంలోనే ఇటీవల ఆసియా కప్‌ను గెలుచుకున్న భారత్ తాజాగా వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగుతోంది.

Rohit Sharma
Rohit Sharma comments on captaincy : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒంటి చేత్తో ఎన్నో విజయాలను భారత జట్టుకు అందించాడు. అయితే.. రోహిత్ తన కెరీర్‌లో చాలా ఆలస్యంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతడి సారథ్యంలోనే ఇటీవల ఆసియా కప్‌ను గెలుచుకున్న భారత్ తాజాగా వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగుతోంది. గురువారం నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
26 లేదా 27 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం వస్తే బాగుండేది అని అభిప్రాయపడ్డాడు. అయితే.. జీవితంలో అన్నకున్న వెంటనే ఏదీ జరగదని పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నర్లుగా నిలిచిన చాలా మందికి కెప్టెన్సీ చేపట్టే అవకాశం రాలేదన్నాడు. జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందని చెప్పాడు. కెప్టెన్సీలో ఓనమాలు కూడా తెలియనప్పుడు కాకుండా సరైన సమయంలో ఛాన్స్ వచ్చినట్లుగా భావించాలన్నాడు.
యువరాజ్ మ్యాచ్ విన్నర్ అయినా..
తనకు తెలిసి 26 లేదా 27 ఏళ్ల వయసు అనేది కెప్టెన్సీకి సరైన సమయంగా భావిస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది అద్భుతమైన ఆటగాళ్ల ఉన్నారు. వారు అందరూ కూడా కెప్టెన్సీ చేపట్టడానికి అర్హులేనని అన్నాడు. ఇక ఇప్పుడు తన వంతు వచ్చిందని, తనకంటే ముందు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ లు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించారన్నాడు. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్.. ఇంకా చాలా మంది స్టార్ ఆటగాళ్లు కెప్టెన్సీ చేపట్టలేదని చెప్పాడు.
David Warner : పుష్ప స్టైల్‌లో వార్నర్ సెలబ్రేషన్స్.. శ్రీవల్లి హుక్ స్టెప్.. ఇంకా..
‘యువరాజ్ సింగ్‌ను మర్చిపోకూడదు. అతడు ఓ మ్యాచ్ విన్నార్. అయినా కానీ ఎప్పుడూ కూడా కెప్టెన్సీ చేయలేదు. ఓ సమయంలో అతడికి కెప్టెన్సీ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. జీవితం అంటే అదే. మనం అనుకున్నది జరగదు.’ అని రోహిత్ తెలిపాడు. కెప్టెన్సీలో ఓనమాలు కూడా తెలియనప్పుడు కాకుండా.. అన్నీ తెలిసినప్పుడు అంటే ఇప్పుడు సరైన సమయంలో కెప్టెన్‌గా ఛాన్స్ వచ్చిందని భావించాలని రోహిత్ చెప్పాడు.
సమిష్టిగా రాణిస్తేనే..
“2013 నుంచి ఐసీసీ ట్రోఫీలను మనం గెలవలేదు. ప్లరేదు. దాని గురించి నేను అతిగా ఆలోచించడం లేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకున్నాం. వన్డే ప్రపంచకప్ 2023 విజేతగా నిలవాలి అంటే మాత్రం అందరూ సమిష్టిగా రాణించాలి. 11 మ్యాచుల్లో విజయాలు సాధిస్తేనే విజేతగా నిలుస్తాం. అయితే.. ఒకటిన్నర నెలలో 11 వన్డే మ్యాచులు ఆడడం అంటే కొంచెం కష్టమైన పనే. ప్రతి మ్యాచ్‌కు పేసర్లను చాలా ప్రెష్‌గా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి తగిన విశ్రాంతి కల్పించాలి. ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా కీలకం.” అని రోహిత్ శర్మ అన్నాడు.
ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాక్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ICC World Cup 2023: టికెట్ల కోసం నన్ను అడగవద్దంటూ కోహ్లీ అభ్యర్థన.. అనుష్క శర్మ ఆసక్తికర రిప్లై