ICC World Cup 2023: టికెట్ల కోసం నన్ను అడగవద్దంటూ కోహ్లీ అభ్యర్థన.. అనుష్క శర్మ ఆసక్తికర రిప్లై

విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ స్టోరీకి అనుబంధంగా అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాశారు..

ICC World Cup 2023: టికెట్ల కోసం నన్ను అడగవద్దంటూ కోహ్లీ అభ్యర్థన.. అనుష్క శర్మ ఆసక్తికర రిప్లై

Virat Kohli and Anushka Sharma

Updated On : October 4, 2023 / 7:03 PM IST

Virat Kohli – Anushka Sharma : ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈనెల 5న ప్రారంభ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఈనెల 8న భారత్ తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అయితే, ఇప్పటికే వరల్డ్ కప్ లోని మ్యాచ్ లకు సంబంధించి టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇండియా ఆడే మ్యాచ్ లకు టికెట్లకోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తన స్నేహితులందరికీ ఓ అభ్యర్థన చేశారు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దంటూ పేర్కొన్నారు.

Read Also : టీమ్ఇండియాతో తిరువ‌నంత‌పురం వెళ్ల‌ని కోహ్లీ..! ముంబైకి ఎందుకు వెళ్లాడు..?

విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ – ఇండియా వార్మప్ మ్యాచ్ రద్దయిన త‌రువాత మేనేజ్‌మెంట్ అనుమ‌తితో ముంబైకి వెళ్లిన‌ట్లు తెలిసింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే విరాట్ కోహ్లీ ముంబైకి వెళ్లిన‌ట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్న‌తాధికారి వెల్ల‌డించిన‌ట్లు క్రిక్‌బ‌జ్ త‌న క‌థ‌నంలో తెలిపింది. సోమ‌వారం తిరిగి విరాట్ కోహ్లీ టీమ్ఇండియాతో క‌ల‌వ‌నున్న‌ట్లు పేర్కొంది. ఈ క్రమంలో విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ కప్ మ్యాచ్ లకు సంబంధించి టికెట్లకోసం నన్ను అభ్యర్ధించవద్దని స్నేహితులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను.. మీ ఇళ్ల నుంచి మ్యాచ్ ను ఆనందించండి ప్లీజ్ అంటూ విరాట్ తన ఇన్ స్టా స్టోరీలో రాశాడు.

Read Also : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ప్రారంభ వేడుక‌లు ర‌ద్దు..!

విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ స్టోరీకి అనుబంధంగా అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాశారు.. ‘నన్ను జోడించనివ్వండి.. దయచేసి మీ సందేశాలకు సమాధానం రాకపోతే సహాయం చేయమని నన్ను అభ్యర్థించవద్దు.. అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు’ అంటూ రాశారు. వీరి అభ్యర్థనలను చూస్తుంటే వరల్డ్ కప్ మ్యాచ్ ల టికెట్ల కోసం ఏస్థాయిలో పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

https://twitter.com/CricCrazyJohns/status/1709429817433784367?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1709429817433784367%7Ctwgr%5E2bbdc43f63cf449905a86acac6d9e6e2d0746861%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.probatsman.com%2Ficc-world-cup-2023-anushka-sharma-responds-hilariously-to-virat-kohlis-instagram-request-dont-ask-for-world-cup-tickets