New Zealand vs South Africa
New Zealand vs South Africa : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది.
కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (60 ; 50 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) లు రాణించారు. డేవాన్ కాన్వే (2), రచిన్ రవీంద్ర (9), కెప్టెన్ టామ్ లాథమ్ (4), మిచెల్ సాంటర్న్ (7) లు విఫలం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్ మూడు, గెరాల్డ్ కోయెట్జీ రెండు, రబాడ ఓ వికెట్ తీశాడు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా డికాక్ (114; 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), డస్సెన్ (133; 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో దుమ్మురేపడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా 24 పరుగులు చేయగా ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (53; 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. క్లాసెన్(15), మార్క్రామ్(6) లు నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ రెండు వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, నీషమ్ చెరో వికెట్ తీశారు.
రెండో వికెట్‌కు 200 పరుగులు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది దక్షిణాఫ్రికా. డికాక్ నెమ్మదిగా ఆడగా కెప్టెన్ బవుమా బౌండరీలు బాదాడు. అయితే.. అతడిని బౌల్డ్ ఔట్ చేయడంతో 38 పరుగుల వద్ద సౌతాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన డసెన్‌తో జతకట్టిన డికాక్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళ్లాడు. వీళ్లు ఇద్దరు బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 103 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో డికాక్‌కు ఇది నాలుగో శతకం కావడం గమనార్హం.
IND vs SL : ఇండియా vs శ్రీలంక.. హెడ్ టు హెడ్ రికార్డ్స్..
200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఊపుమీదున్న డికాక్, డసెన్ జోడిని డికాక్‌ను ఔట్ చేయడం ద్వారా సౌతీ విడగొట్టాడు. కొద్ది సేపటికే డసెన్ 101 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. మరికాసేపటికే అతడు పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.