Suryakumar Yadav : పాపం సూర్య‌కుమార్ యాద‌వ్.. కోహ్లీ స్వార్థం వ‌ల్లే ర‌నౌట్‌..? వీడియో వైర‌ల్‌.. మండిప‌డుతున్న నెటీజ‌న్లు..!

రాక రాక వ‌చ్చిన అవ‌కాశాన్ని మాత్రం సూర్య స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు.

Suryakumar Yadav run out

Suryakumar Yadav run out : టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య గాయ‌ప‌డ‌డంతో ఎట్ట‌కేల‌కు సూర్య‌కుమార్ యాద‌వ్‌ కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ తుది జ‌ట్టులో స్థానం ద‌క్కించుకున్నాడు. రాక రాక వ‌చ్చిన అవ‌కాశాన్ని మాత్రం సూర్య స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా న్యూజిలాండ్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో సూర్య‌కుమార్ ను దుర‌దృష్టం వెంటాడింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న అరంగ్రేటం చేసిన మ్యాచ్‌లో కేవ‌లం నాలుగు బంతులు మాత్ర‌మే ఆడిన సూర్య రెండు ప‌రుగులే చేశాడు. విరాట్ కోహ్లీతో స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా ర‌నౌట్ అయ్యాడు.

ఏం జ‌రిగిందంటే..?

కేఎల్ రాహుల్ (27) ఔటైన త‌రువాత ఆరో స్థానంలో సూర్య‌కుమార్ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 33.5వ ఓవ‌ర్‌లో సూర్య క‌వ‌ర్స్ దిశ‌గా షాట్ ఆడాడు. సింగిల్ కోసం ప‌రిగెత్తాడు. అయితే.. అక్క‌డ ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ సాంట్న‌ర్ అద్భుత‌మైన డైవ్ తో బంతిని ఆపాడు. ముందు సింగిల్ కోసం ప‌రిగెత్తిన కోహ్లీ ఫీల్డ‌ర్ డైవ్ ను చూసి ఆగి వెన‌క్కి వెళ్లి పోయాడు. అయితే.. అప్ప‌టికే సూర్య దాదాపు కోహ్లీ వ‌ర‌కు వెళ్లిపోయాడు.

Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ ప్ర‌పంచ రికార్డు.. 52 ఏళ్ల వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

బంతిని అందుకున్న శాంట్న‌ర్ దాన్ని పిచ్ మ‌ధ్య‌లో ఉన్న బౌల‌ర్ బౌల్ట్‌కు అందించ‌గా.. ఏ మాత్రం కంగారు ప‌డ‌కుండా బౌల్ట్ దాన్ని కీప‌ర్ కు అందించాడు. సూర్య మ‌ళ్లీ వెన‌క్కు చేరుకునేందుకు ప్ర‌య‌త్నించిప్ప‌టికీ అప్ప‌టికే కీప‌ర్ లాథ‌మ్ అత‌డిని ర‌నౌట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా.. కొంద‌రు నెటీజ‌న్లు కోహ్లీ పై మండిప‌డుతున్నారు. కోహ్లీ గ‌నుక ఆగకుండా పరుగెత్తి ఉంటే సూర్య ర‌నౌట్ అయ్యే వాడు కాద‌ని అంటున్నారు.

ODI World Cup 2023 : డిఫెండింగ్ ఛాంపియ‌న్ కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు.. మిగిలిన వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్‌ల‌కు స్టార్ పేస‌ర్ దూరం

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. డారిల్ మిచెల్ (130) సెంచ‌రీతో చెల‌రేగాడు. ర‌చిన్ ర‌వీంద్ర (75) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ ఐదు వికెట్ల‌తో న్యూజిలాండ్ ప‌తానాన్ని శాసించాడు. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బుమ్రా, సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు. విరాట్ కోహ్లీ (95), రోహిత్ శ‌ర్మ‌(46), జ‌డేజా (39 నాటౌట్‌) లు రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 48 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.