WPL 2023, Gujarat vs Mumbai Live Updates
WPL 2023, Gujarat vs UP Live Updates: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ.. 19.5 ఓవర్లలో టార్గెట్ ను చేజ్ చేసింది. మరో బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. యూపీ వారియర్స్ కు గుజరాత్ జెయింట్స్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ.. 19.5 ఓవర్లలో టార్గెట్ ను చేజ్ చేసింది. మరో బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూపీ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 26 బంతుల్లోనే 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. సింగిల్ హ్యాండ్ తో జట్టుని గెలిపించింది. ఆమె ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
? ????? ???? ???????? ?
The @UPWarriorz register their first win of the #TATAWPL ??
PURE JOY for Grace Harris who finishes off in style ⚡️⚡️
Scorecard ▶️ https://t.co/vc6i9xFK3L#TATAWPL | #UPWvGG pic.twitter.com/2vsQbKcpyX
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
Grace Harris scored a match-winning 59* off just 26 deliveries as she becomes our Top Performer from the second innings ??
Scorecard ▶️ https://t.co/vc6i9xFK3L
Take a look at her batting summary ✅ #TATAWPL | #UPWvGG pic.twitter.com/lcR5ervi1F
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
యూపీ వారియర్స్ జట్టు 16 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. 105 పరుగుల జట్టు స్కోర్ వద్ద 7 వికెట్ ను కోల్పోయింది. దేవికా వైద్య 4 పరుగులు చేసి ఔట్ అయ్యింది.
యూపీ వారియర్స్ వెను వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. అలిస్సా హీలీ 7 పరుగులు చేసి కిమ్ గార్త్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగింది. ఆ వెంటనే శ్వేత 5 పరుగులకే కిమ్ గార్త్ బౌలింగ్ లోనే ఔటైంది. ఆ తర్వాత కిమ్ గార్త్ బౌలింగ్ లోనే తాహిలా (0) కూడా వెనుదిరిగింది. ప్రస్తుతం క్రీజులో కిరణ్ నవ్గిరె (4) ఉంది.
WHAT. A. CATCH! ?
Kim Garth takes a sharp grab off her own bowling to dismiss the #UPW skipper Alyssa Healy!
Follow the match ▶️ https://t.co/vc6i9xFK3L#TATAWPL | #UPWvGG pic.twitter.com/QJTNvBKvVw
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
యూపీ వారియర్స్ కు గుజరాత్ జెయింట్స్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హర్లీన్ డియోల్ 46 పరుగులు, గార్డ్ నర్ 25 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది.
గుజరాత్ జెయింట్స్ ఆరో వికెట్ కోల్పోయింది. గార్డ్ నర్ 25 పరుగులకు ఔట్ అయిన తర్వాత హర్లీన్ డియోల్ 46 పరుగులకు ఔట్ అయింది.
గుజరాత్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయింది. సుష్మా వర్మ 9 పరుగులకు ఔట్ అయిన తర్వాత గార్డ్ నర్ 25 పరుగులకు ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో హర్లీన్ డియోల్, హేమలత ఉన్నారు. గుజరాత్ స్కోరు ప్రస్తుతం 141/5 (17 ఓవర్లకు)గా ఉంది.
గుజరాత్ స్కోరు ప్రస్తుతం 103/4 (14 ఓవర్లకు)గా ఉంది. ప్రస్తుతం క్రీజులో హర్లీన్ డియోల్ 23, గార్డనర్ 18 పరుగులతో ఉన్నారు.
గుజరాత్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. సుష్మా వర్మ 9 పరుగులకు ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో హర్లీన్ డియోల్, గార్డ్ నర్ ఉన్నారు. స్కోరు 91/4 (13 ఓవర్లకు)గా ఉంది.
గుజరాత్ జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయింది. సోఫియా 13 పరుగులు చేసి, ఔట్ అయిన కాసేపటికే మేఘన 24 పరుగులకు, అన్నాబెల్ సదర్లాండ్ 8 పరుగులకు ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో హర్లీన్ డియోల్, సుష్మా వర్మ ఉన్నారు.
గుజరాత్ జెయింట్స్ ఓపెనర్లు మొదటి ఓవర్లలో ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. మేఘన 4 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసింది. అయితే, సోఫియా 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేసి, ఔట్ అయింది. స్కోరు 34/1 (4 ఓవర్లు)గా ఉంది.
యూపీ వారియర్స్ జట్టు: అలిస్సా హీలీ, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, దేవికా వైద్య, గ్రేస్ హారిస్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, కిరణ్ నవ్‌గిరే, అంజలి, శ్వేతా, సిమ్రాన్ షేక్.
గుజరాత్ జట్టు: కిమ్ గార్త్, సుష్మా వర్మ, స్నేహ రానా, మాన్సీ జోషి, సబ్బినేని మేఘన, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళాన్ హేమలత, సోఫియా డంక్లీ, తనూజ కన్వర్, హర్లీన్ డియోల్.
? Team Updates ?@SnehRana15 to captain @GujaratGiants tonight in absence of Beth Mooney.
A look at the Playing elevens of the two teams ? #TATAWPL | #UPWvGG pic.twitter.com/F32saHVHri
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
3️⃣ changes for us tonight!
➡️ Dunkley, Verma and Garth
⬅️ Mooney, Monica and Wareham #UPvGG #TATAWPL #BringItOn #GujaratGiants pic.twitter.com/NQBpztP5uf— Gujarat Giants (@GujaratGiants) March 5, 2023