IND vs NZ : వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆయుష్ బదోని ఇన్.. న్యూజిలాండ్‌తో మిగిలిన వన్డేలకు నవీకరించిన భారత జట్టు ఇదే..
న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు వన్డేలకు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) దూరం అయ్యాడు.
Washington Sundar ruled out of IND vs NZ ODI series Ayush Badoni IN
- గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్
- కివీస్‌తో మిగిలిన వన్డే నుంచి ఔట్
- అతడి స్థానంలో ఆయుష్ బదోనికి చోటు
IND vs NZ : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. అతడి స్థానంలో ఆయుష్ బదోనిని జట్టులోకి తీసుకుంది.
‘ఆదివారం వడోదరలోని బీసీఏ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో (IND vs NZ) బౌలింగ్ చేస్తున్నప్పుడు భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన ఎడమ కింది పక్కటెముకల భాగంలో తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నాడు. అతనికి మరిన్ని స్కానింగ్‌లు నిర్వహించనున్నారు. ఆ తర్వాత బీసీసీఐ వైద్య బృందం నిపుణుల సలహా తీసుకుంటుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వన్డే సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌ల నుండి వాషింగ్టన్ సుందర్ వైదొలిగాడు. అతడి స్థానంలో ఆయుష్ బదోనిని సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడు రెండో వన్డే వేదికైన రాజ్‌కోట్‌లో జట్టుతో చేరుతాడు.’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
🚨 News 🚨
Washington Sundar ruled out of #INDvNZ ODI series; Ayush Badoni receives maiden call-up.
Details ▶️ https://t.co/ktIeMig1sr #TeamIndia | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 12, 2026
న్యూజిలాండ్‌తో రెండు, మూడో వన్డే కోసం నవీకరించిన భారట జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని.
IND vs NZ : అందుకే మేం ఓడిపోయాం.. ఆ ఒక్క పని చేసుంటేనా.. కివీస్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జనవరి 14న రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.
