WPL 2026 Delhi Capitals captain Jemimah Rodrigues fined for slow over-rate in loss to GG
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను ఢిల్లీ సంక్లిష్టం చేసుకుంది. అసలే ఓటమి బాధలో ఉన్న ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కు భారీ జరిమానా విధించారు నిర్వాహకులు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో బెత్ మూనీ(58; 46 బంతుల్లో 7 ఫోర్లు), అనుష్క శర్మ(39; 25 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి నాలుగు వికెట్లు తీసింది. చినెల్లే హెన్రీ రెండు వికెట్లు పడగొట్టింది. మరిజన్నే కాప్, నందని శర్మ, మిన్ను మణి తలా ఓ వికెట్ తీశారు.
IND vs NZ : విశాఖ వేదికగా నేడు నాలుగో టీ20 మ్యాచ్.. సంజూ శాంసన్ పైనే అందరి కళ్లు..
అనంతరం ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో నికీ ప్రసాద్(47; 24 బంతుల్లో 9 ఫోర్లు), స్నేహ్ రాణా(29; 15 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. షెఫాలీ వర్మ(14), లిజెల్లే లీ(11), జెమీమా(16), మరిజన్నే కాప్(0) విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో సోఫీ డివైన్ నాలుగు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ మూడు వికెట్లు తీసింది.
ఆఖరి ఓవర్‌లో 9 రన్స్ అవసరం కాగా..
ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం అయ్యాయి. అయితే.. తొలి బంతికి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి రాణా తప్పించుకుంది. ఈ సమయంలో రనౌటా కాదా అనేది తేల్చేందుకు ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సాయం కోరారు. దీంతో ఆటకు కాసేపు విరామం వచ్చింది. దీంతో ఢిల్లీ బ్యాటర్ల ముమెంటం దెబ్బతింది.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ను పాక్ బహిష్కరిస్తే ఐసీసీ తీసుకునే చర్యలు ఇవే..?
𝗦𝗼𝗽𝗵𝗶𝗲 𝗖𝗹𝘂𝘁𝗰𝗵 𝗗𝗲𝘃𝗶𝗻𝗲! 🫡
🎥 She is ice cool under pressure yet again to help @Giant_Cricket clinch a thriller 🧊
Scorecard ▶️ https://t.co/73Ec3xR5A6 #TATAWPL | #KhelEmotionKa | #GGvDC pic.twitter.com/kbdAKnUaKP
— Women’s Premier League (WPL) (@wplt20) January 27, 2026
తొలి మూడు బంతుల్లో సోఫీ డివైన్ నాలుగు పరుగులే ఇచ్చింది. నాలుగో బంతికి రాణా ఔట్ కాగా.. ఐదో బంతికి సింగిల్ వచ్చింది. ఆఖరి బంతికి విజయానికి నాలుగు పరుగులు అవసరం కాగా.. నికీ ప్రసాద్ ఔట్ కావడంతో ఢిల్లీ ఓడిపోయింది.
జెమీమాకు జరిమానా..
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు స్లో ఓవర్ రేటు (నిర్ణీత సమయానికి ఓవర్లను పూర్తి చేయకపోవడం)నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ స్లో ఓవర్ రేటుకు పాల్పడడం ఇదే తొలిసారి కావడంతో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు.