×
Ad

WPL 2026 : ఆర్‌సీబీ వ‌ర్సెస్ ఢిల్లీ ఫైన‌ల్ మ్యాచ్‌.. హెడ్‌-టు-హెడ్, పిచ్ రిపోర్టు..

డ‌బ్ల్యూపీఎల్ 2026 (WPL 2026 ) సీజ‌న్ ఫైన‌ల్‌లో ఆర్‌సీబీ, ఢిల్లీ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

WPL 2026 Final RCB vs DC today head to head and pitch report

WPL 2026 : మ‌హిళల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) 2026 సీజ‌న్ చివ‌రి అంకానికి చేరుకుంది. గురువారం వ‌డోద‌రా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. డ‌బ్ల్యూపీఎల్ ఆరంభం నుంచి వ‌రుస‌గా నాలుగో సారి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫైన‌ల్ చేరుకుంది.

మూడు సార్లు నిరాశే ఎదురుర‌వ్వ‌గా.. నేటి మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించి తొలి సారి క‌ప్పును ముద్దాడాల‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ భావిస్తోంది. ఇక ఈ సీజ‌న్‌లో వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్ కు చేరుకున్న ఆర్‌సీబీ అదే జోష్‌లో ఢిల్లీని ఓడించి రెండో సారి క‌ప్పును ముద్దాడాల‌ని ఆరాట‌ప‌డుతోంది. 2024లోనూ ఢిల్లీని ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓడించి ఆర్‌సీబీ క‌ప్పును ముద్దాడింది.

బ్యాటింగే ఢిల్లీ బ‌లం..

ఈ సీజ‌న్‌లో మ్యాచ్‌ల‌ను గ‌మ‌నిస్తే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్ర‌ధాన బ‌లం ఆ జ‌ట్టు బ్యాటింగే. ఓపెన‌ర్లు లిజెలీ లీ, షెఫాలీ వ‌ర్మ‌లు మెరుపు ఆరంభాల‌ను అందిస్తున్నారు. ఆ త‌రువాత లారా వోల్వార్ట్‌, జెమీమా రోడ్రిగ్స్‌, మరిజేన్ కాప్‌ల‌తో కూడిన ఆ జ‌ట్టు బ్యాటింగ్ చాలా ప‌టిష్టంగా క‌న‌ప‌డుతోంది. ఇక బౌలింగ్‌లో పేస‌ర్ నందిని శ‌ర్మ‌, స్పిన్న‌ర్ శ్రీచ‌ర‌ణీలు సత్తా చాటుతున్నారు. వీరిద్ద‌రితో పాటు మ‌రిజేన్ కాప్, షినెలి హెన్రీలు బౌలింగ్‌లో రాణిస్తే ఢిల్లీకి తిరుగు ఉండ‌దు.

WPL 2026 : డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్.. ఎల్లీస్ పెర్రీ రికార్డు పై స్మృతి మంధాన క‌న్ను.. ఏకైక ఆర్‌సీబీ ప్లేయ‌ర్‌గా

మంధాన రాణిస్తే..

కెప్టెన్ స్మతి మంధాననే ఆర్‌సీబీ జ‌ట్టుకు అతి పెద్ద బ‌లం. ఈ సీజ‌న్‌లో 290 ప‌రుగులు చేసింది. ఆమెతో పాటు గ్రేస్ హారిస్‌, రిచా ఘోష్‌లు రాణిస్తే భారీ స్కోరు చేయొచ్చు. న‌దైన్ డిక్లెర్క్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని టీమ్‌మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. బౌలింగ్ లో లారెన్ బెల్ డాట్ బాల్స్‌తో ప్ర‌త్య‌ర్థికి చుక్కులు చూపిస్తోంది. ఆమెతో పాటు శ్రేయాంక పాటిల్ , రాధ యాద‌వ్‌లు రాణిస్తే ఆర్‌సీబీ మ‌రోసారి క‌ప్పును ముద్డాడ‌డం పెద్ద క‌ష్టం కాదు.

హెడ్‌-టు-హెడ్‌..

డ‌బ్ల్యూపీఎల్ చ‌రిత్ర‌లో ఆర్‌సీబీ, ఢిల్లీ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ఆరు సార్లు ఢిల్లీ విజేత‌గా నిలిచింది. మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ గెలుపొందింది. డ‌బ్ల్యూపీఎల్ 2024 ఫైన‌ల్‌లో మాత్రం ఆర్‌సీబీనే విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ సీజ‌న్‌లో రెండు సార్లు త‌ల‌ప‌డగా చెరో సారి విజ‌యం సాధించాయి.

Sanju Samson : సంజూ శాంస‌న్ స్వయంకృతాపరాధం.. అనుభ‌వించాల్సిందేనా..! టీ20ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓపెన‌ర్‌గా ఇషాన్ కిష‌న్‌!

పిచ్ రిపోర్టు..

వడోదరలోని బీసీఏ స్టేడియం బ్యాట‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామం. ఈ సీజ‌న్‌లో టాస్ గెలిచిన జ‌ట్లు ఛేజింగ్ కే ప్రాధాన్య‌త ఇచ్చాయి. నాలుగు మ్యాచ్‌లు ఆడ‌గా మూడు సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జ‌ట్లే విజేత‌గా నిలిచాయి. దీంతో టాస్ గెలిచిన జ‌ట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపొచ్చు. స్పిన్న‌ర్లు కూడా కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంది.