×
Ad

WPL 2026 : దంచికొట్టిన మెగ్ లానింగ్, లీచ్‌ఫీల్డ్.. ముంబై ఎదుట భారీ ల‌క్ష్యం

డ‌బ్ల్యూపీఎల్ 2026లో (WPL 2026) యూపీ వారియర్జ్ జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్ ఎదుట భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది.

WPL 2026 UP Warriorz Women vs Mumbai Indians Women MI Target is 188

WPL 2026 : మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్ 2026)లో భాగంగా శ‌నివారం ముంబై ఇండియ‌న్స్, యూపీ వారియర్జ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు సాధించింది. యూపీ బ్యాట‌ర్ల‌లో మెగ్ లానింగ్ (70; 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు, ఫోబ్ లీచ్ ఫీల్డ్ (61; 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) దంచికొట్టారు.

U19 World Cup 2026 : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. బాబ‌ర్ ఆజామ్ రికార్డు బ్రేక్‌..

హ‌ర్లీన్ డియోల్ (25), క్లో ట్రయాన్ (21) కూడా రాణించారు. కిరణ్ నవగిరే, శ్వేతా సెహ్రావత్, దీప్తి శ‌ర్మ‌లు డ‌కౌట్లు అయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ (1) విఫ‌లమైంది. ముంబై బౌల‌ర్ల‌లో అమేలియా కెర్ మూడు వికెట్లు తీసింది. నాట్ సైవర్-బ్రంట్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది. నికోలా కారీ, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Shubman Gill : న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. 3 ల‌క్ష‌ల ఖ‌రీదైన వాట‌ర్ ఫ్యూరిఫ‌య‌ర్‌ను వెంట తెచ్చుకున్న‌గిల్ !

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో ముంబై, యూపీ జ‌ట్లు ఇప్ప‌టికే ఓ సారి త‌లప‌డ్డాయి. ఆ మ్యాచ్‌లో యూపీ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాటి మ్యాచ్‌కు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ముంబై ఆరాట‌పడుతోంది.