Tokyo Olympics : సెమీస్ పోరులో భజరంగ్ పూనియాకు పరాజయం

టోక్యో ఒలింపిక్స్ లో మరో పతకం తెస్తాడని అనుకున్న భారత రెజ్లర్ భజరంగ్ పునియా నిరాశపరిచాడు. సెమీస్ లో పోరాడి ఓడాడు. అజర్ బైజాన్ రెజ్లర్ అలియెవ్ హజీ చేతిలో ఓటమి పాలయ్యాడు.

Wrestler Bajrang Punia

Wrestler Bajrang Punia : టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధిస్తాడని అనుకున్న భారత రెజ్లర్ భజరంగ్ పునియా నిరాశపరిచాడు. సెమీస్ లో పోరాడి ఓడాడు. అజర్ బైజాన్ రెజ్లర్ అలియెవ్ హజీ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ జరిగింది. హజీ – పునియాలు పతకం హోరాహోరీగా పోరాడారు. కానీ..హజీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పునియాపై ఒత్తిడి పెంచాడు. 12-5 తేడాతో పునియా పరాజయం చెందాడు. హజీ..ఒలింపిక్ విజేతనే కాకుండా…మూడుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు.

Read More : Amazon : ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా…. అమెజాన్ కీలక నిర్ణయం…

అంతకుముందు…65 కిలోల విభాగంలో క్వార్టర్ 2లో 2-1 తేడాతో ఇరాన్ కు చెందిన గియాసి చెకా మొర్తాజాను మట్టికరిపించాడు. తొలి రౌండ్‌లో భజరంగ్‌పై 0-1 తేడాతో ప్రత్యర్థి గియాసి పైచేయి సాధించినా.. రెండో రౌండ్‌లో అద్భుతంగా పుంజుకున్న భజరంగ్ మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. పది సెకన్ల వ్యవధిలో పునియా రెండు పాయింట్లు సాధించాడు. దీంతో సెమిస్ లో అడుగు పెట్టాడు. సెమీ ఫైనల్ లో హాజీపై గెలిచి…పతకం సాధిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ…హాజీ చేతిలో పునియా పరాజయం చెందాడు.