Wtc Final Team India Trains With High Intensity
Team India Practise : ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సౌథాంప్టన్ స్టేడియంలో గురువారం ఉదయం కోహ్లీ టీమ్ సందడి చేసింది. నెట్ సెషన్స్‌లో క్రికెటర్లు అదరగొట్టారు. ఎంతో ఉత్సాహంతో ఎక్స్‌ర్‌సైజ్, ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమిండియా తీవ్ర కసరత్తు చేస్తుందని తెలిపింది.
ముంబయిలో పది రోజులకు పైగా క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా ఈనెల 3న సౌథాంప్టన్ చేరుకుంది. అక్కడ వరుసగా మూడు రోజులు కఠిన క్వారంటైన్‌లో గడిపింది. ఆంక్షల సడలింపు మొదలవ్వడంతో క్రికెటర్లంతా స్టేడియంలోకి అడుగుపెట్టారు. . రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేశారు. మిగతా ఆటగాళ్లు ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ గడిపారు.
జూన్ 18న ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతోంది. క్వారంటైన్ నియమాల వల్ల భారత్‌కు సన్నాహక మ్యాచులు ఆడేందుకు వీలవ్వలేదు. దాంతో ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. వీలైనన్ని సెషన్లు ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకుంది.
Read More : Foreign Students : విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్, నో పెయిడ్ క్వారంటైన్