Bray Wyatt Dead: డబ్ల్యూడబ్ల్యూఈలో విషాదం.. 36 ఏళ్లకే కన్నుమూసిన మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్
ట్విటర్‌లో ట్రిపుల్ హెచ్ బ్రే వ్యాట్ మరణ వార్తను తెలిపాడు. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రోటుండా నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది..
- Harish Thanniru
- Updated on- August 25, 2023 / 10:58 AM IST
Bray Wyatt Dead
Bray Wyatt: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్, మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ కన్నుమూశాడు. గురువారం రాత్రి గుండెపోటుతో ఆయన మరణించాడు. ఈ విషయాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ట్రిపుల్ హెచ్ అధికారికంగా ధ్రువీకరించారు. బ్రే వ్యాట్ అసలు పేరు విండామ్ రొటుండా. అతనికి 36ఏళ్లు. బ్రే వ్యాట్ మరణం డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. చిన్న వయ్ససులోనే గుండెపోటుతో బ్రే వ్యాట్ మరణించడం అందరిలోనూ విషాదాన్ని నింపింది. అతని మరణం పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు.
Tilak Varma : అద్భుత అవకాశం.. అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడు
డబ్ల్యూడబ్ల్యూఈ లో బ్రేవ్యాట్ ఈ మధ్యకాలంలో కనిపించలేదు. 2009లో ప్రొఫెషనల్ రెజ్లర్ గా బ్రే వ్యాష్ మారాడు. రింగులోకి అతని ఎంట్రీ ఎంతో ఆకట్టుకునేది. ప్రముఖ రెజ్లర్ అండర్‌టేకర్ వచ్చేటప్పుడు లైట్లన్నీ ఎలా ఆపేసేవారో బ్రే వ్యాట్ వచ్చే సమయంలోనూ అలాగే చేసేవారు. అతడు ఓ లాంతరు పట్టుకొని ఎంట్రీ ఇచ్చేవాడు. అతని చివరి మ్యాచ్ 2023 రాయల్ రంబుల్ లో జరిగింది. వ్యాట్ తన కెరీర్లో ఒక డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ షిప్, రెండుసార్లు యూనివర్సల్ ఛాంపియన్ షిప్ టైటిల్స్ ను గెలుచుకున్నాడు.
Tilak varma : వన్డే ప్రపంచకప్ రేసులో హైదరాబాదీ కుర్రాడు..? కష్టమే అయినా అసాధ్యం కాదు..!
ట్విటర్‌లో ట్రిపుల్ హెచ్ బ్రే వ్యాట్ మరణ వార్తను తెలిపాడు. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రోటుండా నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. మా డబ్ల్యూడబ్ల్యూ కుటుంబ సభ్యుడు బ్రే వ్యాట్ మరణించాడన్న విషాద వార్తను మాకు తెలియజేశాడు. ఈ వార్త మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. వ్యాట్ కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నామని అన్నారు. ఇటువంటి విషాద సమయంలో ప్రతిఒక్కరూ వారి కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్రిపుల్ హెచ్ ట్వీట్ లో పేర్కొన్నాడు.
