Tilak Varma : అద్భుత అవ‌కాశం.. అన్ని ఫార్మాట్ల‌లో రాణిస్తాడు

భార‌త క్రికెట్‌లో ప్ర‌స్తుతం బాగా వినిపిస్తున్న పేరు తిల‌క్ వ‌ర్మ‌. వెస్టిండీస్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో స‌త్తా చాట‌డ‌డంతో వ‌న్డేల్లోనూ టీమ్ఇండియా త‌రుపున ఆడే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు.

Tilak Varma : అద్భుత అవ‌కాశం.. అన్ని ఫార్మాట్ల‌లో రాణిస్తాడు

Tilak Varma-Saba Karim

Tilak Varma-Saba Karim : భార‌త క్రికెట్‌లో ప్ర‌స్తుతం బాగా వినిపిస్తున్న పేరు తిల‌క్ వ‌ర్మ‌(Tilak Varma). వెస్టిండీస్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో స‌త్తా చాట‌డ‌డంతో వ‌న్డేల్లోనూ టీమ్ఇండియా (Team India) త‌రుపున ఆడే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు ఈ హైద‌రాబాదీ ఆట‌గాడు. ఆగ‌స్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియ‌క‌ప్‌(Asia Cup) జ‌ట్టులో అత‌డికి చోటు క‌ల్పించారు సెల‌క్ట‌ర్లు. అయితే.. తుది జ‌ట్టులో స్థానం ద‌క్కుతుందా లేదా..? అన్న‌ది త‌రువాతి సంగ‌తి..?

ఆసియా క‌ప్‌లో చోటు ద‌క్కించుకున్న తిల‌క్ వ‌ర్మ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. తిల‌క్‌ ఎంపిక.. సెల‌క్ట‌ర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్‌కు అత‌డిపై ఉన్న న‌మ్మ‌కాన్ని తెలియ‌జేస్తోంద‌ని టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు స‌బా క‌రీం (Saba Karim) అన్నాడు. భ‌విష్య‌త్‌లో అన్ని ఫార్మాట్ల‌లో ఆడే స‌త్తా అత‌డికి ఉంద‌ని అన్నాడు. సెల‌క్ట‌ర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్ కొన్ని సార్లు గ్రౌండ్‌లో ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న చూసిన త‌రువాత‌నే అత‌డికి మ‌ద్ద‌తు ఇవ్వొచ్చున‌ని చెప్పాడు. ఓ ఆట‌గాడిని టీ20ల నుంచి వ‌న్డేల‌కు ఎంపిక చేస్తే ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌న్నాడు.

Virat Kohli : యోయో టెస్టు పాస్‌.. పిక్ షేర్ చేసిన కోహ్లీ.. స్కోరెంతంటే..?

తిల‌క్ వ‌ర్మ 25 లిస్ట్ ఏ మ్యాచులు ఆడాడు. అందులో అత‌డి స‌గ‌టు 50కి పైగా ఉంది. ఈ విష‌యాన్ని ఎవ్వ‌రూ మ‌రిచిపోకూడ‌దు. లిస్ట్ ఏ మ్యాచులు ఆడిన అనుభ‌వం ఉండ‌డంతో అత‌డికి వ‌న్డేలు ఎలా ఆడాల‌న్న విష‌యం తెలుసు. టీ20 ఫార్మాట్ నుంచి వ‌న్డే క్రికెట్‌కు మార‌డానికి పెద్ద‌గా స‌మ‌యం అవ‌స‌రం లేదు. ఈ ముంబై ఇండియ‌న్స్ ఆట‌గాడికి భిన్న‌మైన ప‌రిస్థితుల‌ల్లో ఎలా స‌న్న‌ద్ద‌మ‌వ్వాలో తెలుసున‌ని, నేర్చుకునేందుకు ఇంత కంటే మంచి అవ‌కాశం దొరక‌ద‌ని చెప్పాడు.

టీ20ల్లో రాణించ‌డంతో అత‌డిపై న‌మ్మ‌కం ఉంచి సెల‌క్ట‌ర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ఆసియా క‌ప్‌కు ఎంపిక చేశార‌న్నాడు. భ‌విష్య‌త్తులో అత‌డు అన్ని ఫార్మాట్ల‌లో రాణిస్తాడ‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు.

Harry Brook : చ‌రిత్ర సృష్టించిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాడు