Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ సిక్స‌ర్ల మోత‌.. ప్ర‌పంచ రికార్డు స‌మం

టీమ్ ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ చ‌రిత్ర సృష్టించాడు.

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal Most sixes in innings : టీమ్ ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ చ‌రిత్ర సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ రికార్డును స‌మం చేశాడు. రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌నత అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 236 బంతుల‌ను ఎదుర్కొని 14 ఫోర్లు, 12 సిక్స‌ర్ల సాయంతో 214 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

య‌శ‌స్వి జైస్వాల్ (భార‌త్) – 12 సిక్స‌ర్లు (2024) – 214* ప‌రుగులు
వ‌సీం అక్ర‌మ్ (పాకిస్తాన్‌) – 12 (1996) – 257*
నాథ‌న్ ఆస్టిల్ (న్యూజిలాండ్‌) – 11 (2002) – 222
మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) – 11 (2003) – 380
బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ (న్యూజిలాండ్‌) – 11 (2014) – 202
బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ (న్యూజిలాండ్‌) – 11 (2014) – 195
బెన్‌స్టోక్స్‌ మెక్‌క‌ల్ల‌మ్ (న్యూజిలాండ్‌) – 11 (2016) – 258
కుశాల్ మెండీస్ (శ్రీలంక‌) – 11 (2023) – 245

Mike Procter : క్రికెట్ ప్ర‌పంచంలో పెను విషాదం.. దిగ్గజ ఆట‌గాడు కన్నుమూత

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగులు చేయ‌గా బ‌దులుగా ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 319 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు కీల‌క‌మైన 126 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం య‌శ‌స్వి జైస్వాల్ (214*) ద్విశత‌కం బాద‌డంతో రెండో ఇన్నింగ్స్‌ను భార‌త్ 430/4 వ‌ద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 557 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యం నిలిచింది. భార‌త బ్యాట‌ర్ల‌లో జైస్వాల్ కాకుండా శుభ్‌మ‌న్ గిల్ (91), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (68నాటౌట్) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జోరూట్‌, టామ్ హార్డ్లీ, రెహాన్ అహ్మ‌ద్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

ట్రెండింగ్ వార్తలు