Sledging : ఈ యువ కెప్టెన్ మాట‌లు విన్నారా..? చిన్నోడే గానీ మ‌హాముదురు..!

స్లెడ్జింగ్.. ఈ ప‌దాన్ని ఎక్కువగా మ‌నం క్రికెట్‌లో వింటుంటాం. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల ఏకాగ్ర‌త‌ను మాట‌ల‌తో దెబ్బ‌తీయ‌డాన్ని స్లెడ్జింగ్ అంటాం.

young captains hilarious pep talk to team

Sledging : స్లెడ్జింగ్.. ఈ ప‌దాన్ని ఎక్కువగా మ‌నం క్రికెట్‌లో వింటుంటాం. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల ఏకాగ్ర‌త‌ను మాట‌ల‌తో దెబ్బ‌తీయ‌డాన్ని స్లెడ్జింగ్ అంటాం. 1990 చివ‌రలో 2000 ప్రారంభంలో ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు ఎక్కువ‌గా స్లెడ్జింగ్ చేసేవారు. స్టీవా, పాంటింగ్ వంటి ఆట‌గాళ్లు కేవ‌లం వారి ఆట యొక్క నైపుణ్యాల‌తోనే కాదు వారి యొక్క దూకుడు స్వ‌భావంతోనూ పేరు సంపాదించారు. అప్ప‌ట్లో ఆసీస్ అస్త్రాల‌లో స్లెడ్జింగ్ కూడా ఉండేది.

టీమ్ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్య‌త‌లు చేపట్టిన త‌రువాత ప‌రిస్థితులు మారిపోయాయి. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు క‌వ్విస్తే అంతకంటే దీటుగా బ‌దులు ఇచ్చేవారు. అత‌డి నాయ‌క‌త్వంలో భార‌త్ అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఆస్ట్రేలియా బ్యాక్ టు బ్యాక్ టెస్టు సిరీస్‌ల‌ను గెలుచుకుంది. కాగా.. 2022లో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ టెస్టు సిరీస్ కోల్పోయిన త‌రువాత విరాట్ టెస్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. ఆ త‌రువాత రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.

David Warner : దయచేసి నా ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ ఇవ్వండి.. వీడ్కోలు టెస్ట్‌కు ముందు డేవిడ్ వార్నర్ విజ్ఞప్తి

తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఓ యువ కెప్టెన్ ఉద్వేగ‌భ‌రితంగా ఆవేశ‌పూరితంగా మాట్లాడుతున్నాడు. త‌న జ‌ట్టు స‌భ్యుల‌ను మ్యాచ్ ఆరంభం నుంచి స్లెడ్జింగ్ చేయ‌మ‌ని కోరాడు. అయితే.. ఇది ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగింది అన్న విష‌యాలు మాత్రం తెలియ‌రాలేవు. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టిస్తోంది. మొద‌టి టెస్టు మ్యాచులో ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. బుధ‌వారం నుంచి కేప్‌టౌన్ వేదిక‌గా ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచులో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.

Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు బుమ్రాను ఊరిస్తున్న అరుదైన రికార్డులు.. అరంగ్రేట మైదానంలోనే అందుకుంటాడా..?

ట్రెండింగ్ వార్తలు