Yuvraj Singh : గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి యువరాజ్ పోటీ చేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీ క్రికెటర్

గురుదాస్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తనపై వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.

Yuvraj Singh

Lok Sabha Election 2024 : టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంటే క్రికెట్ పై అవగాహన ఉన్న వారికి సుపరిచితమే. క్రికెట్ మైదానంలో యువరాజ్ ఉన్నాడంటే సందడి వాతావరణం ఉండేది. అనేకసార్లు జట్టు విజయంలో యువరాజ్ సింగ్ కీలక భూమిక పోషించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత పలు బిజినెస్ లలో భాగస్వామిగా ఉంటూ.. ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, మరోరెండు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి యువరాజ్ పోటీ చేయబోతున్నారంటూ పలు మీడియాల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

Also Read : CM Revanth Reddy : అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలు : సీఎం రేవంత్ రెడ్డి హామీ

భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో 100 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేయొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ జాబితాలో బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక ఇప్పటికే పూర్తయినట్లు, అందులో పంజాబ్ రాష్ట్రం గురుదాస్ పూర్ నుంచి మాజీ క్రికెటర్ యువరాజ్ కు బీజేపీ అవకాశం కల్పిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. గురుదాస్ పూర్ పార్లమెంట్ స్థానం నుంచి గతంలో సెలబ్రిటీలు విజయం సాధించారు. ప్రస్తుతం నటుడు సన్నీడియోల్ ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. అతనికంటే ముందు నటుడు వినోద్ ఖన్నా కూడా ఇక్కడి నుంచే లోక్ సభకు వెళ్లారు. తాజాగా యువరాజ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది.

Also Read : YCP 9th List : వైసీపీ 9వ జాబితా విడుదల.. ఒక పార్లమెంట్, 2 అసెంబ్లీలకు కొత్త ఇంచార్జులు

గురుదాస్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి యువరాజ్ సింగ్ పోటీ చేయబోతున్నాడని వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ స్పందించాడు. తన ఎక్స్ (ట్విటర్) ఖాతా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. యువరాజ్ ట్వీట్ ప్రకారం.. నా సామర్థ్యం మేరకు ప్రజలకు మద్దతు ఇవ్వడం, సహాయం చేయడం నా అభిరుచి. నా ఫౌండేషన్ యూవీక్యాన్ ద్వారా నేను ప్రజలకు సహాయ సహకారాలు కొనసాగిస్తాను. నేను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడం లేదని యువరాజ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో గురుదాస్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రచారానికి యువరాజ్ స్వయంగా రంగంలోకిదిగి చెక్ పెట్టారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు