Yuvraj Singh Father Yograj Singh
Yuvraj Singh Father Yograj Singh: టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ యోగరాజ్ సింగ్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ముగిసిపోవడానికి కపిల్ దేవ్ కారణమంటూ కామెంట్స్ చేశాడు. “అన్ ఫిల్టర్డ్ బై సమ్దీష్”లో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కపిల్ దేవ్ 1983లో టీమిండియా కెప్టెన్ తోపాటు నార్త్ జోన్, హర్యానాకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సమయంలో కపిల్ ఎటువంటి కారణం లేకుండా నన్ను తొలగించాడు’’ అంటూ యోగరాజ్ చెప్పారు.
also Read: బీసీసీఐ కొత్త కార్యదర్శి దేవజిత్ సైకియాను కలిసిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు
జట్టు నుంచి తొలగించడంపై నా భార్య (యువరాజ్ సింగ్ తల్లి) నన్ను ప్రశ్నించింది. అప్పుడు ఆమెకు జరిగిన విషయాన్ని చెప్పా. నన్ను ఎందుకు జట్టు నుంచి తప్పించారో కపిల్ దేవ్ ను అడగాలనుకుంది. అయితే, కపిల్ దేవ్ ను నేనే అడుగుతానని ఆమెకు చెప్పా. కపిల్ కు గుణపాఠం చెప్పాలని నా తుపాకీతో ఆయన ఇంటికి వెళ్లా. తుపాకీతో కపిల్ దేవ్ తలను పేల్చాలని అనుకున్నా. కపిల్ ఇంటికి వెళ్లేసరికి అతను తన తల్లితో బయటకు వచ్చాడు. అప్పుడు కపిల్ తో చెప్పా.. ‘‘ నేను మీ తలకు తుపాకీ గురిపెట్టి చంపేయాలని అనుకున్నా. నీ పక్కన నిలబడి ఉన్న మీ తల్లి కారణంగా నేను అలా చేయడం లేదు.’’
Also Read: IPL 2025: మార్చి 23 నుంచి ఐపీఎల్-2025: రాజీవ్ శుక్లా
2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు ‘‘ప్రపంచ కప్ లో నా కొడుకు (యువరాజ్ సింగ్) మీ కంటే మెరుగ్గా రాణించాడని నేను కపిల్ దేవ్ కు పేపర్ కటింగ్ పంపించా. అతను నాకు రిప్లై ఇచ్చాడు. క్షమాపణలు చెప్పాడు. వచ్చే జన్మలో ఇద్దరం అన్నదమ్ములుగా ఒకే తల్లి కడుపులో జన్మిద్దాం.. అని కపిల్ నాకు వాట్సాప్ సందేశం పంపాడు.’’ అని యోగరాజ్ సింగ్ తెలిపాడు. కపిల్ దేవ్ నన్ను కలవాలని అనుకున్నాడు. కానీ, నాకు అతనిపై ఇంకా కోపం ఉంది. అప్పటి ఘటన నన్ను ఇప్పటికీ బాధిస్తూనే ఉందని యోగరాజ్ అన్నారు.
కపిల్ దేవ్ తో పాటు మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీపై యోగరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిషన్ సింగ్ బేడీ తనపై కుట్ర పన్నాడు. నన్ను తొలగించినప్పుడు సెలెక్టర్లలో ఒకరైన రవీంద్ర చద్దా వద్దకు వెళ్లి మాట్లాడాను. అప్పుడు ఆయన చెప్పిన విషయం ప్రకారం.. బిషన్ సింగ్ బేడీ (చీఫ్ సెలెక్టర్) నన్ను సునీల్ గవాస్కర్ మనిషిగా భావించాడు. ముంబైలో క్రికెట్ ఆడుతున్నందున నన్ను ఎంపిక చేయడం ఇష్టం లేదని తెలిసింది. నేను గవాస్కర్ తో చాలా సన్నిహితంగా ఉండేవాడిని అని యోగరాజ్ సింగ్ తెలిపారు.
1980 డిసెంబర్ 21న బ్రిస్బేన్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో యోగరాజ్ సింగ్ తన అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. సునీల్ గావస్కర్ కెప్టెన్సీలో అతను తన తొలి మ్యాచ్ ఆడాడు. యోగరాజ్ సింగ్ 1980-81లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో భారత్ తరపున ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు.