బీసీసీఐ కొత్త కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియాను కలిసిన హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రావు

రాష్ట్రంలో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాల‌నే తెలంగాణ ప్ర‌భుత్వ ఆకాంక్ష‌ను కూడా వారికి జ‌గ‌న్మోహ‌న్ రావు తెలియ‌జేశారు.

బీసీసీఐ కొత్త కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియాను కలిసిన హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రావు

Jagan Mohan Rao

Updated On : January 12, 2025 / 7:03 PM IST

బీసీసీఐ కొత్త కార్య‌ద‌ర్శిగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన దేవ‌జిత్ సైకియాను హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆదివారం ముంబైలో జ‌రిగిన బీసీసీఐ ప్రత్యేక స‌ర్వ స‌భ్య స‌మావేశం (ఎస్‌జీఎం)లో జ‌గ‌న్‌మోహ‌న్ రావు హెచ్‌సీఏ ప్ర‌తినిధిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా దేశంలో క్రికెట్ అభివృద్ధికి బోర్డు తీసుకునే నిర్ణ‌యాల‌కు త‌న సంపూర్ణ మ‌ద్ద‌తును తెలియ‌జేశారు. అలాగే కొత్త కార్య‌ద‌ర్శిగా దేవ‌జిత్‌, కోశాధికారిగా ప్ర‌భ్‌తేజ్ సింగ్ భాటియా ఏక‌గ్రీవ ఎన్నిక‌ను బ‌ల‌ప‌ర్చారు. స‌మావేశం అనంత‌రం ఇరువురుని ప్ర‌త్యేకంగా క‌లిసి తెలంగాణ‌లో క్రికెట్ అభివృద్ధికి గ‌తంలో కంటే మ‌రింత ఎక్కువ‌గా స‌హ‌క‌రించాల‌ని కోరారు.

అలాగే, రాష్ట్రంలో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాల‌నే తెలంగాణ ప్ర‌భుత్వ ఆకాంక్ష‌ను కూడా వారికి జ‌గ‌న్మోహ‌న్ రావు తెలియ‌జేశారు. జ‌గ‌న్మోహ‌న్ రావు విజ్ఞ‌ప్తుల‌కు సానుకూలంగా స్పందించిన ఇరువురు తెలంగాణ‌లో క్రికెట్ అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని భ‌రోసా ఇచ్చారు.

IPL 2025: మార్చి 23 నుంచి ఐపీఎల్‌-2025: రాజీవ్ శుక్లా