IPL 2025: మార్చి 23 నుంచి ఐపీఎల్‌-2025: రాజీవ్ శుక్లా

బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా జైషా స్థానంలో దేవజిత్ సైకియా, అలాగే, కోశాధికారిగా ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా ఎంపికయ్యారు.

IPL 2025: మార్చి 23 నుంచి ఐపీఎల్‌-2025: రాజీవ్ శుక్లా

IPL 2025

Updated On : January 12, 2025 / 6:39 PM IST

క్రికెట్‌ అభిమానులను గుడ్‌న్యూస్‌. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ మే 25న ఉంటుందని చెప్పారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

ఇవాళ జరిగిన బీసీసీఐ సమావేశంలో కోశాధికారి (ట్రెజరర్‌), కార్యదర్శి (సెక్రటరీ) నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా జైషా స్థానంలో దేవజిత్ సైకియా, అలాగే, కోశాధికారిగా ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా ఎంపికయ్యారు. అలాగే, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) వేదికపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, ఐపీఎల్‌ 2024.. గత ఏడాది మార్చి 22న ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌తో ప్రారంభమైంది. గత ఏడాది మే 26న జరిగిన ఫైనల్‌ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచింది. ఐపీఎల్‌ అదనంగా ఒక సంవత్సరం కాలానికి కొత్త కమిషనర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటన చేసింది.

మరోవైపు, బీసీసీఐ జనవరి 18-19 తేదీల్లో మరో సమావేశం నిర్వహించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఖరారు చేయడంపై ఆ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటుంది.

Poco X7 Series : అద్భుతమైన ఫీచర్లతో పోకో X7 సిరీస్ వచ్చేసింది.. ఈ ఫోన్ ధర ఎంతో తెలుసా?