T20 World Cup 2024 : రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్

రోహిత్ శర్మ కెప్టెన్సీపై యువరాజ్ మాట్లాడుతూ.. ఈ టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా కీలకం కాబోతుంది. నిజంగా చెప్పాలంటే ..

Yuvraj Singh : వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్తంగా అతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచ కప్ -2024 టోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడుతుంది. ఇప్పటికే బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడనుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా యువరాజ్ సింగ్ ను ఐసీసీ నియమించిన విషయం తెలిసిందే.

Also Read : IPL 2024 : టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు శుభవార్త

రోహిత్ శర్మ కెప్టెన్సీపై యువరాజ్ మాట్లాడుతూ.. ఈ టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా కీలకం కాబోతుంది. నిజంగా చెప్పాలంటే రోహిత్ శర్మ మంచి కెప్టెన్. ఒత్తిడిలో సరియైన నిర్ణయాలు తీసుకునే తెలివైన కెప్టెన్ అతను. కెప్టెన్ గా ఐదు ఐపీఎల్ ట్రోపీలు గెలుచుకున్నాడు. భారత్ జట్టుకు కెప్టెన్ రోహిత్ లాంటి వ్యక్తి అవసరమని నేను భావిస్తున్నాను. రోహిత్ శర్మను ప్రపంచ కప్ ట్రోపీ, ప్రపంచ కప్ పతకంతో చూడాలనుకుంటున్నాను. అతను అందుకు అర్హుడు అంటూ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

Also Read : SRH vs MI : వాంఖడే స్టేడియంలో జూనియర్ బుమ్రా సందడి.. ఫోటోలు వైరల్.. స్పెషల్ ఏమిటో తెలుసా?

రోహిత్ శర్మ ఎప్పుడూ నార్మల్ గా ఉంటాడు. జట్టు విజయం సాధించిన తరువాత కూడా అతనిలో ఎలాంటి గర్వం, మార్పు ఉండదు. అది రోహిత్ శర్మను మరింత సమర్ధవంతమైన కెప్టెన్ మార్చింది. ఎప్పుడూ తనతోటి కుర్రాళ్లతో రోహిత్ సరదాగా ఉంటాడు. వారిపై జోకులు వేస్తూ అందరితో కలివిడిగా ఉంటాడు. మైదానంలో గొప్ప నాయకుడు. నాకు సన్నిహిత క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరు అంటూ యువరాజ్ చెప్పుకొచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు