Bumrah
Jasprit Bumrah: టీమిండియా మాజీ ఫేసర్ జహీర్ ఖాన్.. జస్ప్రిత్ బుమ్రాను ట్రూలీ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అంటూ పొగిడేస్తున్నాడు. సెంచూరియన్ వేదికగా సఫారీలతో డిసెంబర్ 26న జరిగే తొలి టెస్టు ముందు ఈ కాంప్లిమెంట్ ఇవ్వడం విశేషం.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లలో జరిగిన టెస్టుల్లో సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ‘మాకు జస్ప్రిత్ బుమ్రా ఉన్నాడు. ట్రూలీ వరల్డ్ క్లాస్ ప్లేయర్. ప్రత్యర్థి జట్టును సమస్యల్లోకి నెట్టేస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.
బుమ్రా అరంగ్రేటం చేసిన 2018లోని దక్షిణాఫ్రికా పర్యటన చాలా కీలకమైనది.
…………………………… : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం క్లారిటీ
‘ప్రతి ఒక్క టెస్టులోనూ 20వికెట్లు తీయగలరు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మ్యాచ్ ల్లో స్థిరంగా రాణిస్తున్నారు. ఇది చాలా మంచి, బ్యాలెన్స్‌డ్ అటాక్. ఫాస్ట్ బౌలింగ్ అటాక్ లో పటిష్ఠంగా ఉంది’ అని జహీర్ చెప్పుకొచ్చాడు.
‘ఇషాంత్ శర్మ లాంటి పొడుగాటి బౌలర్ ఉన్నారు. ఎక్స్‌ట్రా బౌన్స్ రాబట్టొచ్చు. మొహమ్మద్ షమీలా డెక్ కు ఇరు వైపులా సీమ్ కు ప్రయత్నించొచ్చు. అంతేకాకుండా శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ లాంటి మరో ఆయుధం మన దగ్గర ఉంది’ అని వివరించాడు జహీర్ ఖాన్.