Special Status : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం క్లారిటీ

ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని రాష్ట్రానికి అందించినట్లు కేంద్రమంత్రి పంకజ్ చౌధురి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు.

Special Status : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం క్లారిటీ

Ap

Updated On : December 22, 2021 / 6:48 AM IST

Central Government clarity : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ స్టేటస్‌కు బదులుగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని తెలిపింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధురి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఇటీవల నీతి అయోగ్‌ను ముఖ్యమంత్రి జగన్ కోరిన సంగతి నిజమేనని కేంద్రం చెప్పింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో కేంద్ర వాటా 90 శాతం, రాష్ట్ర వాటా 10 శాతం ఉంటుందని కేంద్రం తెలిపింది.

ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని రాష్ట్రానికి అందించామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధురి చెప్పారు. విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి అన్నారు.

Divorce Settlement : రూ.5,500 కోట్ల భరణం.. ప్రపంచంలోనే అతిపెద్ద విడాకుల సెటిల్‌మెంట్ ఇదే..!

మరోవైపు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటామని ఏపీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ తెలిపారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటి పరిష్కారం కోసమే కేంద్రానికి సహకరిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమని కృష్ణదాస్‌ అన్నారు.