PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ముసలం? పీసీబీ ఛైర్మన్ పదవికి జకా అష్రఫ్ రాజీనామా..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ జకా అష్రఫ్ తన పదవికి రాజీనామా చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : January 20, 2024 / 08:01 AM IST
Zaka Ashraf resigns as PCB Chairman
PCB Chairman : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ జకా అష్రఫ్ తన పదవికి రాజీనామా చేశారు. లాహోర్‌లో శుక్రవారం జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. పాక్ హెడ్ కోచ్‌గా మిక్కీ ఆర్ధర్ తన పదవికి రాజీనామా చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే జకా అష్రఫ్ కూడా తప్పుకోవడం గమనార్హం. పీసీబీ చైర్మన్‌గా జకా అష్రఫ్ గతేడాది జూలై 6న బాధ్యతలు చేపట్టాడు. అయితే.. ఏడాది కూడా పూర్తి కాకుండానే ఆయన తప్పుకున్నాడు.
సమావేశంలో అష్రఫ్.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టు సందర్శనతో సహా తన విజయాలను జాబితా గురించి హైలెట్ చేశాడు. సమావేశం చివరలో తన రాజీనామాను ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్‌కు పంపారు. తనపై నమ్మకం ఉంచిన వారికి, ఇంతకాలం తనకు సహకరించిన వారికి ఈ సందర్భంగా అష్రఫ్ ధన్యవాదాలు తెలియజేశాడు. పాక్ క్రికెట్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
మద్దుతు లేకనే..
తాను పాకిస్తాన్ క్రికెట్‌ను బాగు చేసేందుకు ఎంతో కష్టపడుతున్నప్పటికీ తనకు సరైన మద్దతు లభించకపోవడంతోనే పీసీబీ చైర్మన్ పదవికి జకా అష్రఫ్ రాజీనామా చేసినట్లు పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. జకా అష్రఫ్ హయాంలో పాకిస్తాన్ ఎక్కువ మ్యాచుల్లో ఓడిపోయింది. ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరలేకపోయింది. వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసి లీగ్ స్టేజీలోనే నిష్ర్కమించింది. ఇటీవల ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను 0-3తో కోల్పోయిన పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 0-4తో వెనుకబడి ఉంది.
WTC Points table : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..
