Zimbabwe cricketer Bat throwing celebration goes wrong
Viral Video : కొందరు ఆనందంలో చేసే పనులు పక్కవారికి ప్రమాదంగా మారుతాయి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకనే అతి ఉత్సాహాన్ని హద్దులో ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. క్రికెట్‌లో మ్యాచ్ గెలిచామనే ఆనందంలో బ్యాటర్ చేసిన పనికి అంపైర్ కాలికి గాయమైంది. ఈ ఘటన జింబాబ్వే దేశవాలీ క్రికెట్ టోర్నీలో చోటు చేసుకుంది.
నేషనల్ వన్డే కప్-2024లో భాగంగా బుధవారం రెయిన్ బో వన్ క్రికెట్ క్లబ్, ఓగో రేంజర్స్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఓగో రేంజర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 45 ఓవర్లలో 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో రెయిన్ బో వన్ క్రికెట్ క్లబ్ బరిలోకి దిగింది. 44.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
విజయం కోసం ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో స్పిన్నర్ ర్యాన్ బర్ల్ వేసిన బంతిని ఫ్రాన్సిస్ సాండే బలంగా బాదాడు. బంతి సిక్స్‌గా వెళ్లింది. దీంతో విజయం సాధించాం అనే ఆనందంలో సాండే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తన చేతిలోని బ్యాట్‌ను తిప్పుతూ నాన్ స్ట్రైకింగ్ వైపు విసిరేశాడు. అది కాస్త అంఫైర్ కాలికి తగిలింది. ఆ సమయంలో బంతి వైపు చూస్తున్న అంపైర్ బ్యాట్‌ను గమనించలేదు.
బ్యాట్ తగలగానే అంపైర్ నొప్పితో విలవిలలాడాడు. వెంటనే తేరుకుని సిక్స్ సిగ్నల్ ఇచ్చాడు. మళ్లీ బాధతో కాలు రుద్దుకుంటూ కనిపించాడు. అయితే.. ఇంత జరిగినా కూడా సాండే అంపైర్ క్షమాపణలు కూడా చెప్పలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంపైర్ పై ఎప్పటి నుంచొ పగపెంచుకున్నాడని, అందుకనే ఇలా బదులు తీర్చుకున్నాడని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్.. ఏకంగా ఇద్దరు..
The ???????? ??????? ?????? dishes out sissling hot action! ??
Rainbow wanted 4 runs off the last ball against SOGO Rangers ?#NPL2024 pic.twitter.com/oj0bwT1X4Q
— Zimbabwe Cricket Domestic (@zcdomestic) July 31, 2024