Best AI Tools 2026 : టాప్ క్రియేటర్లు వాడే ఫేవరెట్ AI టూల్స్ ఇవే.. మీరు ట్రై చేశారా? ఒక్కసారి వాడితే వదలరు!
Best AI Tools 2026 : ఏఐ టూల్స్ వాడుతున్నారా? మీ రోజువారీ పనులను వేగంగా కంప్లీట్ చేసేందుకు ఈ బెస్ట్ ఏఐ టూల్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.. ఇంతకీ అవేంటో ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- April 23, 2026 / 06:11 PM IST
Best AI Tools 2026
- కొత్త ఏఐ టూల్స్ వాడేందుకు ట్రై చూస్తున్నారా?
- రోజువారీ టాస్క్ కోసం ఈ బెస్ట్ ఏఐ టూల్స్ వాడొచ్చు
- క్లాడ్ నుంచి జెమిని వరకు ఏ టూల్ అయినా ఓకే
Best AI Tools 2026: ఇప్పుడంతా ఏఐనే.. చాలామంది ఏఐ తెగ వాడేస్తున్నారు. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా యూజర్లు ఏఐతో వీడియోలు, ఫొటోలు జనరేట్ చేసి వైరల్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఏఐ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతి పనికి ఏఐనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఈ ఏఐ టూల్స్ ఏదో ఒక విషయాన్ని తెలుసుకునేందుకు వాడేస్తున్నారు.
మీరు కూడా ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? కొన్ని విషయాలపై అవగాహన లేకున్నా ఏదైనా సందేహం ఉన్నా వెంటనే ఏఐ టూల్స్ ఓపెన్ చేసి మరి అడిగేస్తున్నారు. అందుకే ఈ ఏఐ టెక్నాలజీకి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది.
వాస్తవానికి, ఈ ఏఐ టూల్స్ మీ సందేహాలను నిమిషాల్లో పరిష్కరించగలవు. క్లాడ్ నుంచి జెమిని వరకు సూచనలు మాత్రమే కాదు.. మీ సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం ఫొటోలను కూడా జనరేట్ చేసి ఇవ్వగలవు.
క్లాడ్ :
క్లాడ్ ఏఐ యాప్ మీ సమస్యలను వేగంగా పరిష్కరించగలదు. ఈ ఏఐ టూల్ రీసెర్చ్ డాక్యుమెంట్ రాయగలదు. కోడ్ బగ్ ఫిక్స్ చేయగలదు. ఇలా అన్ని విషయాలలో క్లాడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ అవసరాలకు అనుగుణంగా సమాధానాలను జనరేట్ చేయగలదు. కేవలం కాలేజీ అసైన్‌మెంట్‌లకే కాకుండా ఈమెయిల్‌లు రాసేందుకు సోషల్ మీడియా పోస్ట్‌లను జనరేట్ చేయగలదు.
పెర్ప్లెక్సిటీ ఏఐ :
పెర్ప్లెక్సిటీ ఏఐ మీ సందేహాలను నిమిషాల్లో పరిష్కరించగలదు. ఈ యాప్‌లో ప్రో సెర్చ్ టూల్ కూడా ఉంది. లోతుగా రీసెర్చ్ చేయగలదు. వాయిస్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది. మీ ప్రశ్నలకు పర్సనల్ టచ్ అందిస్తుంది. పెర్ప్లెక్సిటీ ఏఐని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్రౌజర్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు.
చాట్‌జీపీటీ :
చాట్‌జీపీటీ అనేది భారీ పాపులర్ ఏఐ టూల్. యూజర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏదైనా సమస్యలకు పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది. చాట్‌జీపీటీ ఏఐలో వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. మీ సందేహాలను ఫిక్స్ చేసేందుకు మీ భాషలోనే మాట్లాడగలదు.
గూగుల్ జెమిని :
గూగుల్ జెమిని అనేది మరో అద్భుతమైన ఏఐ యాప్. నానో బనానా చిప్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేయగలదు. ఈ యాప్ యూఐ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఫొటోలు క్రియేట్ చేయడమే కాదు.. భారీ మొత్తంలో ఎస్సేలను కూడా జనరేట్ చేయగలదు.
గ్రామర్లీ ఏఐ :
గ్రామర్లీ ఏఐ అనేది మీ అసైన్‌మెంట్‌లు, ఆర్టికల్స్ రీసెర్చ్ పేపర్‌లను ఎలాంటి తప్పులు లేకుండా రాసే ఏఐ అసిస్టెంట్. పేపర్లు ఆర్టికల్స్ రాసేటప్పుడు గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొన్ని తప్పులు వస్తుంటాయి. గ్రామర్లీ ఏఐ ఆ తప్పులను వెంటనే సరిచేసి, మీ ఆర్టికల్స్‌ను అక్షర దోషాలు లేకుండా చేస్తుంది.
