Top 5 Smartphones : ఇన్‌స్టా యూజర్లకు పండగే.. మీ రీల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే టాప్ 5 స్మార్ట్ఫోన్లు.. లైక్స్, కామెంట్లు ఆగవు..!
Top 5 Smartphones : రూల్స్ కోసం మంచి ఫోన్ కొనాలని చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
Top 5 Smartphones
- ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలా?
- ఈ ఫోన్లతో ఒక రీల్ చేశారంటే ఓవర్ నైట్ స్టార్ అవ్వొచ్చు
- మీ బడ్జెట్ ధరలో లభించే టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే
Top 5 Smartphones : ఇన్‌స్టా యూజర్ల కోసం అద్భుతమైన ఫోన్లు.. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటారా? ఈ స్మార్ట్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు. చాలామందికి ఖరీదైన కెమెరా కొనడం కన్నా మంచి కెమెరా ఫీచర్లు ఉన్న ఫోన్ కొనడం బెటర్.
మీరు కూడా మంచి కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. మీకోసం మార్కెట్లో (Top 5 Smartphones) అద్భుతమైన కెమెరా ఫీచర్లతో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ కొనేసుకోవచ్చు. ఫీచర్లు, ధరల వారీగా ఏ ఫోన్ కొంటే బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మి 16 ప్రో ప్లస్ (రూ. 48,999) :
రియల్‌మి 16 ప్రో ప్లస్‌లో 200MP + 50MP + 8MP రియర్ కెమెరాతో పాటు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్తో వస్తుంది. ఈ యూనిట్ రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బిలియన్ కలర్లు, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది.
Read Also : Summer AC Tips : మీ AC సరిగ్గా కూలింగ్ అవ్వడం లేదా? అసలు కారణాలివే.. మీకు మీరే ఫిక్స్ చేయొచ్చు.. ఎలాగంటే?
వన్‌ప్లస్ 13s (రూ. 52,999):
వన్‌ప్లస్ 13sలో డ్యూయల్ 50MP రియర్ కెమెరా 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆక్సిజన్ఓఎస్ 16 ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బిలియన్ కలర్ ఆప్షన్లతో 6.32-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 5850mAh బ్యాటరీ ఉన్నాయి.
రెడ్మి నోట్ 15 ప్రో+ (రూ. 39,999):
రెడ్మి నోట్ 15 ప్రో+ 68 బిలియన్ కలర్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 200MP + 8MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ యూనిట్, హైపర్ఓఎస్ 2పై రన్ అవుతుంది. 6500mAh బ్యాటరీ కూడా ఉంది.
వివో V60e 5G (రూ. 31,999) :
వివో V60e 5జీ ఫోన్ ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఫన్‌టచ్ 15తో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 200MP + 8MP రియర్ కెమెరా 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ యూనిట్లో 6500mAh బ్యాటరీ, 90W ఛార్జర్ ఉన్నాయి.
ఐక్యూ 15ఆర్ (రూ. 50,999) :
ఐక్యూ 15ఆర్ ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 144Hz రిఫ్రెష్ రేట్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఒరిజిన్OS 6పై రన్ అవుతుంది. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP + 8MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
