Summer AC Tips : మీ AC సరిగ్గా కూలింగ్ అవ్వడం లేదా? అసలు కారణాలివే.. మీకు మీరే ఫిక్స్ చేయొచ్చు.. ఎలాగంటే?
Summer AC Tips : ఏసీ కూలింగ్ ఆగిపోయిందా? ఎండాకాలంలో ఏసీ సరిగ్గా కూలింగ్ కాకపోవడానికి ముఖ్యమైన కారణాలివే.. ఇలా చేశారంటే టెక్నిషియన్ లేకుండానే ఫిక్స్ చేయొచ్చు..
Summer AC Tips
- ఎయిర్ ఫిల్టర్ మురికి పట్టేయడం వల్ల ఏసీ కూలింగ్ అవ్వదు
- గది సైజుకు తగిన ఏసీ యూనిట్ ఉన్నా కూడా రూమ్ సరిగ్గా కూలింగ్ కాదు
- మీ ఏసీ కూలింగ్ సమస్యకు సంబంధించి ఇలా సింపుల్ చెకింగ్ చేయండి
Summer AC Tips : అసలే ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఏసీలు, కూలర్లు ఆన్ చేయకుండా ఉండలేని పరిస్థితి. కానీ, కొన్నిసార్లు ఎయిర్ కండిషనర్ ఆన్ చేసినా కూలింగ్ సరిగా కాదు. ఇలా జరిగినప్పుడు చాలామంది ఏసీ కూలింగ్ అవ్వడం లేదు పాడైపోయిందని అనుకుంటారు.
వాస్తవానికి, అది ఏసీ పాడైపోవడం కాదు.. చాలా సందర్భాలలో, దుమ్ము (Summer AC Tips) పేరుకుపోవడం లేదా చిన్నపాటి లోపాల కారణంగా గది సరిగ్గా కూల్ అవ్వదు. ఈ సాధారణ కారణాలతో సమస్యను గుర్తించవచ్చు కొన్నిసార్లు టెక్నీషియన్‌ను పిలవడానికి ముందే మీకు మీరే ఈ సమస్యలను ఫిక్స్ చేయొచ్చు.
ఏసీ సరిగ్గా కూలింగ్ కావడం లేదా? ముఖ్యమైన కారణాలివే :
డర్టీ ఎయిర్ ఫిల్టర్ :
ఏసీ కూలింగ్ తగ్గిపోవడానికి ఫిల్టర్ కూడా ఒక కారణం. ఇది మురికిగా ఉంటే ఫిల్టర్‌పై దుమ్ము పేరుకుపోయి ఎయిర్ ఫ్లోను అడ్డుకుంటుంది గదిలోని వెచ్చని గాలిని లోపలికి లాగడానికి సిస్టమ్‌కు ఎక్కువ పని అవుతుంది. మొత్తం కూలింగ్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది.
దుమ్ము, ధూళిని క్లీన్ చేసేందుకు ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి. ప్రతి కొన్ని వారాలకు ఫిల్టర్‌ను క్లీనింగ్ లేదా మార్చడం, సరైన ఎయిర్ ఫ్లో వచ్చేలా కూలింగ్ సెట్ చేయాలి.
లో-రిఫ్రిజెరెంట్ లెవల్ :
రిఫ్రిజెరెంట్ అనేది ఏసీ లోపల ఉండే వాయువు. గదిలోని వేడిని పీల్చుకుంటుంది. రిఫ్రిజెరెంట్ లెవల్ తగ్గితే కూలింగ్ ప్రక్రియ తక్కువగా ఉంటుంది. సాధారణంగా సిస్టమ్‌లో లీక్ కారణంగా ఇలా జరుగుతుంది. సౌండ్ లేదా రిఫ్రిజెరెంట్ లైన్‌పై ఐస్ గడ్డకట్టడం వంటి సంకేతాలను గమనించవచ్చు.
Read Also : PNB Customers : PNB కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. ఇకపై ఇంటినుంచే బ్యాంకింగ్ సర్వీసులు.. వారికి మాత్రమే..!
థర్మోస్టాట్ లోపం :
థర్మోస్టాట్ మీ ఏసీ టెంపరేచర్ సెట్టింగ్ కంట్రోల్ చేస్తుంది. అది సరిగ్గా పనిచేయకపోతే సిస్టమ్‌కు రాంగ్ ఇండికేషన్స్ పంపవచ్చు. తద్వారా ఏసీ కూలింగ్ అవ్వొచ్చు లేదంటే పూర్తిగా కూలింగ్ ఆగిపోవచ్చు.
కంప్రెసర్ సమస్యలు :
ఏసీ సిస్టమ్ పనిచేయాలంటే రిఫ్రిజెరెంట్కు కంప్రెసర్ తప్పనిసరి. అది పనిచేయకపోయినా లేదా స్టార్ట్ కాకపోయినా ఏసీ కూల్ కాదు. కంప్రెసర్ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. మంచి టెక్నీషియన్‌తో ఈ కంప్రెసర్ ఇష్యూను ఫిక్స్ చేయించాలి.
ఏసీ సైజు తప్పుగా ఎంచుకోవడం :
మీ గది పరిమాణానికి ఏసీ యూనిట్ చాలా చిన్నదిగా ఉంటే గదిని సరిగా కూలింగ్ కాదు. ఏసీ సామర్థ్యం గది సైజుకు సరిపోయేలా చూసుకోండి. మంచి కూలింగ్ కోసం సరైన పరిమాణంలో ఉన్న ఏసీని ఎంచుకోవడం బెటర్.
మీరు ఏమి చేయాలంటే? :
మీ ఏసీ సరిగ్గా కూలింగ్ కాకపోతే.. ముందుగా కొన్ని ఈజీ చెకింగ్స్ చేసి చూడవచ్చు. చాలా సందర్భాలలో చిన్న మార్పులతోనే ఏసీ కూలింగ్ పెంచుకోవచ్చు. ముందుగా ఎయిర్ ఫిల్టర్లను క్లీన్ చేయండి.
ఎందుకంటే డస్ట్ పేరుకుపోవడం, ఎయిర్ ఫ్లో అడ్డుకుని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చాలా ఫిల్టర్లను ఈజీగా తొలగించి నీటితో కడగవచ్చు. ఫిల్టర్లను తిరిగి యూనిట్లో పెట్టే ముందు పూర్తిగా ఆరనివ్వండి. అలాగే, అవుట్డోర్ యూనిట్ డస్ట్, ఆకులు లేదా ఇతర పదార్థాలతో మూసుకుపోయాయో లేదో చెక్ చేయండి.
ఇలా చెకింగ్ చేశాక కూడా ఏసీ సరిగ్గా కూలింగ్ కాకపోతే టెక్నీషియన్ పిలవండి. రిఫ్రిజెరెంట్ లీకులు, కంప్రెసర్ ఫెయిల్యూర్ లేదా పవర్ కట్ వంటి సమస్యలకు నిపుణుల చెకింగ్, రిపేర్లు అవసరం. క్రమం తప్పకుండా సర్వీసింగ్ కూడా చేయిస్తుండాలి. అప్పుడే వేసవి సీజన్లో ఏసీ సక్రమంగా పనిచేస్తుంది.
