PNB Customers : PNB కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. ఇకపై ఇంటినుంచే బ్యాంకింగ్ సర్వీసులు.. వారికి మాత్రమే..!
PNB Customers : పీఎన్బీ కస్టమర్ల కోసం బ్యాంకు అద్భుతమైన బెనిపిట్స్ అందిస్తోంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసును ప్రారంభించింది. ఇాది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..
PNB Customers
- పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లకు బిగ్ రిలీఫ్
- ఇకపై ఇంటినుంచే PNB బ్యాంకింగ్ సర్వీసులు
- పూర్తిగా 6 నెలలపాటు పైసా ఖర్చు ఉండదు
PNB Customers : పీఎన్బీ కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వయోవృద్ధులు, దివ్యాంగులైన ఖాతాదారుల కోసం అద్భుతమైన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై పంజాబ్ బ్యాంకు కస్టమర్లు తమ బ్యాంకింగ్ అవసరాల కోసం ప్రత్యేకించి బ్యాంకుకు (PNB Customers) వెళ్లాల్సిన అవసరం ఉండదు. పీఎన్బీ, పీఎస్బీ అలయన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్’ను ప్రారంభించింది. అత్యవసర బ్యాంకింగ్ సేవలను నేరుగా కస్టమర్ల ఇళ్ల వద్దనే పొందవచ్చు.
వయస్సు, ఆరోగ్యం లేదా శారీరక పరిమితుల కారణంగా బ్యాంకుకు వెళ్లడం కష్టంగా భావించే వ్యక్తుల కోసం ఈ సర్వీసును ప్రత్యేకంగా రూపొందించారు. వినియోగదారులకు సొంత ఇళ్లలోనే సౌకర్యవంతంగా అనేక కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.
కస్టమర్ల సర్వీసును మెరుగుపరచడం లక్ష్యంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో పీఎస్బీ అలయన్స్ ద్వారా ఈ సర్వీసును ప్రారంభించింది. ఈ ఫ్రీ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసు ఏప్రిల్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. పూర్తిగా 6 నెలల పాటు వయోవృద్ధులు, దివ్యాంగులైన వినియోగదారులు తమ బ్యాంకింగ్ పనులను ఇంటి నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా నిర్వహించుకోవచ్చు.
ఇళ్ల నుంచే అన్ని సర్వీసులు :
ఈ సర్వీసులో క్యాష్ విత్‌డ్రా, చెక్కుల డిపాజిట్లు, ఖాతా ఎంక్వైరీలు, ముఖ్యమైన డాక్యుమెంట్ల డెలివరీ వంటి ఆప్షన్లు ఉంటాయి. వినియోగదారులు తమ ఇళ్ల నుంచే సౌకర్యవంతంగా లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించడం, అకౌంట్ స్టేట్మెంట్లను రిక్వెస్ట్ చేయడం, కేవైసీ లేదా రిజిస్ట్రేషన్ వివరాలను అప్డేట్ చేయడం కూడా చేయవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ARCIL)లో మొత్తం 10.01శాతం వాటాను అవెన్యూ ఇండియా రీసర్జెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించింది. పీఎన్బీ ఇకపై (ARCIL)కు స్పాన్సర్‌గా వ్యవహరించదు.
ఈ సర్వీసు ద్వారా వినియోగదారులు క్యాష్ పేమెంట్లు, డిమాండ్ డ్రాఫ్ట్ జారీ, పే ఆర్డర్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేయడం, ఇతర ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను పూర్తి చేయొచ్చు. అంతేకాదు.. చెక్‌బుక్ సర్వీసులు, డిపాజిట్, విత్‌డ్రాయల్ ప్రాసెస్ కూడా ఇళ్లలో నుంచే సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవచ్చు.
ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే :
ఈ సదుపాయం ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉంది. క్రమంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని పీఎన్బీ బ్యాంకు పేర్కొంది. మరింత సమాచారం కోసం వినియోగదారులు తమ సమీపంలోని బ్యాంకు శాఖను సంప్రదించడం లేదా బ్యాంకు హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించింది.
వ్యక్తిగతంగా బ్యాంకుకు రాలేని వారికి ఈ సర్వీసు అద్భుతంగా ఉంటుంది. మొత్తంమీద, పీఎన్బీ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసు అనేది వయోవృద్ధులకు, దివ్యాంగులైన కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. వారికి వారి ఇళ్లలోనే సౌకర్యవంతంగా సేఫ్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది.
