Motorola Edge 70 Fusion : సూపర్ ఆఫర్ మావా.. ఈ మోటోరోలా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫీచర్లు కోసమైన కొనేస్తారు..!
Motorola Edge 70 Fusion : మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,750 డిస్కౌంట్ అందిస్తోంది. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, 12GB ర్యామ్ ఫీచర్లు, కొత్త ధర వివరాలివే..
- Sreehari A
- Published on- November 16, 2026 / 02:30 PM IST
Motorola Edge 70 Fusion
- మోటోరోలా 7000mAh బ్యాటరీ ఫోన్ అతి తక్కువ ధరకే
- 50MP కెమెరా, అమోల్డ్ డిస్‌ప్లేతో అదిరిపోయే ఆఫర్
- రూ. 33,249కే 12GB ర్యామ్, 512GB స్టోరేజ్
Motorola Edge 70 Fusion : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మోటోరోలా అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. మంచి కెమెరా, భారీ బ్యాటరీ, ప్రీమియం డిస్‌ప్లేతో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు.. ముఖ్యంగా ఈ ఫోన్‌పై ప్రస్తుతం రూ.3,750 వరకు తగ్గింపు అందిస్తోంది. ఖరీదైన ఫీచర్లతో ఈ మోటోరోలా ఫోన్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మోటోరోలా ఫోన్ కొత్త ధర ఎంతంటే? :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.36,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.3,750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ మోటోరోలా ఫోన్ ధర రూ.33,249కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ నిబంధనలు వర్తిస్తాయి.
Read Also : Samsung Galaxy A18 4G : వారెవ్వా.. ఐఫోన్ రేంజ్ ఫీచర్లు.. కొత్త శాంసంగ్ ఫోన్ అదుర్స్.. ధర మరి ఇంత తక్కువా?
అదిరిపోయే డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్ :
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటాయి. 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇక స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. బీజీఎంఐ గేమ్‌ను 120fps వరకు రన్ చేయగలదని కంపెనీ చెబుతోంది..
50MP కెమెరా.. 7000mAh బ్యాటరీ :
ఫోటోలు తీసుకోవడానికి ఇందులో OIS సపోర్టుతో 50MP సోనీ ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. అన్ని కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
ఈ మోటోరోలా ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ హైలెట్ అని చెప్పొచ్చు.. సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బ్యాటరీకి 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5జీ కనెక్టివిటీ కూడా ఉన్నాయి.
