Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌‌లో రూ. 24వేల లోపు ధరలో 55 అంగుళాల స్మార్ట్‌టీవీలు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Smart TVs : కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో 55 అంగుళాల స్మార్ట్‌టీవీలు తక్కువ ధరకే లభిస్తున్నాయి.

Smart TVs

Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? మీరు రూ.24వేల కన్నా తక్కువ ధరకు 55 అంగుళాల LED టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో (Smart TVs) షావోమీ, మోటోరోలా, టీసీఎల్, థామ్సన్ వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌టీవీలపై 75శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. 55-అంగుళాల స్మార్ట్ టీవీల వైడ్ రేంజ్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

మీరు తక్కువ ధరకు పెద్ద స్మార్ట్‌టీవీ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత సేల్ Xiaomi, Motorola, TCL, iFFALCON వంటి బ్రాండ్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌టీవీలను 75 శాతం వరకు తగ్గింపుతో పొందవచ్చు. ప్రస్తుతం అత్యంత సరసమైన 55-అంగుళాల స్మార్ట్‌టీవీలలో టాప్ 5 స్మార్ట్‌టీవీ ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.

షావోమీ FX సిరీస్ :
షావోమీ FX సిరీస్ స్మార్ట్‌టీవీ 55-అంగుళాల 4K UHD LED డిస్‌ప్లే కలిగి ఉంది. FireTV OSపై రన్ అవుతుంది. అనేక ప్రీ-ఇన్‌స్టాల్డ్ OTT యాప్‌లతో వస్తుంది. అసలు ధర రూ.54,999, ఫ్లిప్‌కార్ట్‌లో 36 శాతం తగ్గింపుతో రూ.34,999కి కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా QLED టీవీ :
ఈ మోటోరోలా స్మార్ట్‌టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. పవర్‌ఫుల్ 48W స్పీకర్‌తో అమర్చి ఉంటుంది. స్క్రీన్ 4K రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తుంది. ధర రూ. 64,999కు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో 50 శాతం వరకు తగ్గింపుతో రూ. 31,999కి లభిస్తుంది.

Read Also : Ethanol Blending : పాత కారు, బైక్ కొంటున్నారా జాగ్రత్త.. ఈ ఎఫెక్ట్‌తో తుక్కుకి వేయడమే..!

థామ్సన్ QLED టీవీ :
థామ్సన్ QLED టీవీ కేవలం రూ.29,999కే చాలా బాగుంది. అసలు ధర రూ.59,999 కన్నా 50 శాతం తక్కువ. ఇందులో 4K UHD స్క్రీన్, డాల్బీ అట్మాస్, 40W స్పీకర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అయ్యే వేలాది OTT యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇఫాల్కాన్ 4K LED టీవీ :
మీరు iFFALCON 4K ఎల్ఈడీ టీవీ ధర రూ.73,999పై 64 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,999కు మాత్రమే లభిస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ OSపై రన్ అవుతుంది. 4K రిజల్యూషన్ డిస్‌ప్లేతో పాటు ఎంఈఎంసీ, డాల్‌బై అట్మోస్ వంటి ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.

ఫాక్స్కీ QLED టీవీ :
55 అంగుళాల స్క్రీన్ కలిగిన ఫాక్స్‌స్కీ QLED టీవీ కేవలం రూ.23,999కే లభిస్తుంది. అసలు ధర రూ.98,990 నుంచి 75 శాతం తగ్గింపుతో ఈ టీవీ 4K అల్ట్రా HD డిస్‌ప్లేను అందిస్తుంది. డాల్బీ ఆడియో, HDR10 వంటి ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.