HMD Vibe 2 5G : వారెవ్వా.. కొత్త HMD వైబ్ 2 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర రూ.11 వేల లోపే!
HMD Vibe 2 5G Wine Red Launch : హెచ్ఎండీ వైబ్ 2 5జీ కొత్త వైన్ రెడ్ కలర్ ఆప్షన్‌తో లాంచ్ అయింది. రూ.10,499 ధరకు లభించే ఈ ఫోన్లో 6000mAh బ్యాటరీ, 120 హెర్ట్జ్, 50MP కెమెరా వంటి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి.
HMD Vibe 2 5G Wine Red Launch
- ఈ ఫోన్‌కు ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది. కానీ, డిజైన్ ప్రీమియం
- సరికొత్త ఏఐ ఫీచర్లతో 50MP రేర్ కెమెరా ఆప్షన్
- 6000mAh భారీ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు
HMD Vibe 2 5G Wine Red Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? హెచ్ఎండీ సంస్థ వైబ్ 2 5G ఫోన్‌కు కొత్త వైన్ రెడ్ కలర్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. దీపావళి ప్రత్యేక కానుకగా ఈ కొత్త కలర్ ఆప్షన్ అందిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. తద్వారా రూ.11 వేల లోపు ధరలో విక్రయానికి రానుంది.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనపు రాయితీలు లభించనున్నాయి. వైన్ రెడ్‌తో పాటు బ్లూ కలర్ యూనిసోక్ టీ8200 ఎనిమిది కోర్ల చిప్‌సెట్‌ను అందించారు. ఫొటోగ్రఫీ కోసం 50MP ఆకర్షణీయమైన 5G ఫోన్ల లిస్టులో ఈ ఫోన్ చేరింది.
అలాగే, హెచ్ఎండీ వైబ్ 2 5జీ ఫోన్ అక్టోబర్ 8 నుంచి విక్రయానికి రానుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనపు సబ్సిడీలు లభించనున్నాయి. వైన్ రెడ్‌తో పాటు బ్లూ, పర్పల్, రోజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Read Also : WhatsApp New Features : వాట్సాప్‌లో 2 ఇంట్రెస్టింగ్ కొత్త ఫీచర్లు.. ఇకపై ప్రైవసీ, ఫోకస్ మరింత ఈజీ..!
హెచ్ఎండీ వైబ్ 2 5జీ స్పెషల్ ఫీచర్లు :
ఈ హెచ్ఎండీ వైబ్ 2 5జీలో 6.7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. హెచ్డీ ప్లస్ క్లారిటీతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును అందిస్తుంది. ఈ ఫోన్ 4GB, 6GB ర్యామ్ ఆప్షన్లలో 128GB వరకు స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది.
పర్ఫార్మెన్స్ కోసం 6 నానోమీటర్, యూనిసోక్ టీ8200 ఎనిమిది కోర్ల చిప్‌సెట్‌ను అందించారు. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP మెయిన్ రియర్ కెమెరాతో పాటు మరో కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా అందించారు.
ఈ ఫోన్లోని మెయిన్ ఆకర్షణ 6000mAh భారీ బ్యాటరీ అందిస్తుంది. 18 వాట్ల ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16, యూఎస్బీ టైప్-సీ, బ్లూటూత్ 5.0, వై-ఫై 5, సైడ్ మౌంట్ ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
