Best Camera Phones
Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 సందర్భంగా అనేక కెమెరా ఫోన్లపై ఖతర్నాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీ కెమెరా ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్. రూ. 30వేల లోపు ఆకట్టుకునే కెమెరా పర్ఫార్మెన్స్ అందించే టాప్ బ్రాండ్ల కెమెరా ఫోన్లు లభ్యమవుతున్నాయి. తక్కువ ధరలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు. మీరు ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలు చేయగల 6 బెస్ట్ కెమెరా ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన కెమెరా ఫోన్ కొనేసుకోండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (రూ. 27,660) :
రూ.30వేల ధరకు లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఇప్పుడు అమెజాన్‌లో రూ.27,660 ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1B కలర్లు, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించే 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లే కలిగి ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఉంది. ఆప్టిక్స్ పరంగా 50MP + 10MP + 50MP బ్యాక్ సెన్సార్ సెటప్, బెస్ట్ పోర్ట్రెయిట్ ఫొటోల కోసం 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఇంకా, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ద్వారా పవర్ పొందుతుంది.
వివో అధికారిక వెబ్‌సైట్‌లో వివో Y300 ప్లస్ 5G ఫోన్ ధర రూ.29,999గా ఉండగా, ఈ స్మార్ట్‌ఫోన్ రిలయన్స్ డిజిటల్‌లో ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో రూ.22,999గా లభిస్తుంది. డ్యూయల్ 50MP బ్యాక్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 3a 5G (రూ. 24,999) :
నథింగ్ ఫోన్ 3a ఇప్పుడు క్రోమాలో బ్లాక్, వైట్, బ్లూ కలర్ వేరియంట్లలో రూ.24,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP + 50MP + 8MP బ్యాక్ కెమెరా సెటప్ అందిస్తుంది. 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంది.
రియల్‌మి 15 (రూ. 22,979) :
జియోమార్ట్‌లో కస్టమర్లు రియల్‌మి 15 5Gని రూ.22,979కి కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్ 50MP + 8MP డ్యూయల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300+ చిప్‌సెట్ ద్వారా పవర్పొందుతుంది. 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 6.8-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది.
ఒప్పో K13 టర్బో (రూ. 24,982) :
అమెజాన్‌లో ఒప్పో K13 టర్బో వైట్ నైట్ కలర్ వేరియంట్‌లో రూ.24,982 ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 8450 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆండ్రాయిడ్ 15పై ColorOS 15తో రన్ అవుతుంది. 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది.