Best Mobile Phones
Best Mobile Phones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో అద్భుతమైన మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2026లో మీరు ఐఫోన్ 17e కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే. ఈ ఐఫోన్ కన్నా అదే ధర రేంజ్‌లో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లో మరిన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. మీరు ఐఫోన్ 17e కొనడం కన్నా మీ బడ్జెట్ ధరలోనే మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్లలో పవర్‌ఫుల్ కెమెరాల నుంచి పర్ఫార్మెన్స్ వరకు పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
గూగుల్ పిక్సెల్ 10 5G (రూ. 60,990) :
గూగుల్ పిక్సెల్ 10 5జీలో 48MP + 10.8MP + 13MP బ్యాక్ కెమెరా, 10.5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4970mAh బ్యాటరీతో గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ (రూ. 59,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈలో 50MP + 8MP + 12MP బ్యాక్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6.7-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అంతేకాదు.. 4900mAh బ్యాటరీ, 45W ఛార్జర్ అందిస్తుంది.
వివో V70 ఎలైట్ 5G (రూ. 61,999) :
వివో V70 ఎలైట్ 5జీలో 50MP + 50MP + 8MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6500 mAh బ్యాటరీ, 90W ఛార్జర్ ఉన్నాయి. సింగిల్ బిలియన్ కలర్లు, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కూడా అందిస్తుంది.
వన్‌ప్లస్ 15R (రూ. 56,525) :
వన్‌ప్లస్ 15Rలో 50MP + 8MP డ్యూయల్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ వన్‌ప్లస్ 1B కలర్స్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ అందించే ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్సిజన్ OS16తో వస్తుంది. 7400mAh బ్యాటరీ, 80W ఛార్జర్ అందిస్తుంది.
మోటోరోలా సిగ్నేచర్ (రూ. 59,999) :
మోటోరోలా సిగ్నేచర్ 5200mAh బ్యాటరీ, 90W ఛార్జర్‌తో వస్తుంది. ట్రిపుల్ 50MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1B కలర్లతో 6.8-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 5200mAh బ్యాటరీ కూడా ఉంది.
ఒప్పో రెనో 15 ప్రో 5G (రూ. 67,999) :
ఒప్పో రెనో 15 ప్రో 5జీలో 200MP + 50MP + 50MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ColorOS16పై రన్ అవుతుంది. విజువల్స్ కోసం 1B కలర్లతో 6.32 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 6200mAh బ్యాటరీతో వస్తుంది.