Electric Vehicle : మార్కెట్లోకి గ్రావ్ టన్ మోటార్స్ ఎలక్ర్టిక్ వెహికల్ ; రూ.80తో 800 కిలోమీటర్లు
- Guntupalli Ramakrishna
- Published On : July 11, 2021 / 08:02 PM IST
Electrical Vehicle
Electric Vehicle :పెట్రోల్ ధరలు పెరగటంతో అంతా విద్యుత్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. అదే క్రమంలో ప్రభుత్వాలు సైతం విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో పవినియోగదారుల ఆసక్తిని గమనించిన అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించాయి. వివిధ రాష్ట్రాల్లో అనేక అంకుర సంస్ధలు విద్యుత్ వాహనాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టాయి.
ఈ క్రమంలోనే హైద్రాబాదుకు చెందిన అంకుర సంస్ధ గ్రావ్ టన్ మోటార్స్ తన తొలి విద్యుత్ వాహనాన్ని మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి క్వాంటాగా పేరు పెట్టిన సదరు సంస్ధ భద్రతకు ప్రాధాన్యత నిస్తూ ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని రూపొందించినట్లు కంపెనీ సీఈఓ పాక పరశురామ్ తెలిపారు. 80 రూపాయల ఖర్చుతో 800 కిలోమీటర్ల ప్రయాణం అనే కాన్సెప్ట్ తో దీనిని రూపొందించినట్లు తెలిపారు.
క్వాంట్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించేందుకు వీలుంటుంది. లి ఐయాన్ బ్యాటరీని రిబ్ డ్ ఛాసిస్ తో బిగించారు. దీని వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉండదని కంపెనీ ప్రకటించింది. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా బీఎల్ డీసీ మోటార్ ను వినియోగించారు. ఇది 3కిలో వాట్ శక్తిని విడుదల చేస్తుంది.
ప్రస్తుతం కంపెనీ తమ ప్లాంటులో నెలకు 2000వేల యూనిట్ల తయారీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. త్వరలో దీనిని విస్తరించనున్నారు. 5000 యూనిట్ల తయారీ లక్ష్యంగా విస్తరణ చేపటేందుకు ప్రణాళికలను రూపొందించారు. మార్కెట్లోకి విడుదల చేసిన క్వాంటా కొనుగోలు దారులను ఇట్టే ఆకట్టుకుంటుందని కంపెనీ భావిస్తోంది. ఆన్ లైన్ ద్వారా కంపెనీ బుకింగ్ లను ప్రారంభించింది. క్వాంటా ధర 99వేల రూపాయలుగా నిర్ణయించారు. నగరంతోపాటు, పట్టణాల రోడ్లపై ఈ వాహనం అనుకూలంగా ఉంటుంది.
