Vivo X300 E Launch : మైండ్ బ్లోయింగ్ బ్రో.. కొత్త వివో X300 E రేంజ్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు.. ధర జస్ట్..!
Vivo X300 E Launch : వివో నుంచి అద్భుతమైన ఫోన్ లాంచ్ అయింది. వివో ఎక్స్300 ఇ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. భారీ బ్యాటరీతో జూలై 31 నుంచి ఫస్ట్ సేల్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
Vivo X300 E Launch
- వివో ఎక్స్300 E స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్
- 7,200mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 50MP జైస్ ట్రిపుల్ కెమెరా, 144Hz అమోల్డ్ డిస్ప్లే
Vivo X300 E Launch : వివో లవర్స్ పండగ చేస్కోండి. కొత్త వివో X300 E ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 7,200mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో అమోల్డ్ డిస్ప్లే, జైస్-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ (Vivo X300 E Launch) 6 ఉన్నాయి. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వివో ఎక్స్300ఇ బేస్ మోడల్ ధర CNY 4,799 (సుమారుగా రూ. 68వేలు) నుంచి ప్రారంభమవుతుంది. 12GB + 512GB వేరియంట్ ధర CNY 5,299 (సుమారుగా రూ. 75వేలు) ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 31 నుంచి వివో ఆన్లైన్ స్టోర్ ద్వారా చైనాలో సేల్ మొదలు కానుంది. కంపెనీ చెన్ యెహే, మూన్లైట్ వైట్, సన్‌లైట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
వివో ఎక్స్300ఇ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
వివో ఎక్స్300ఇలో 1260×2750 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందించారు. 3డీ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్లో 3nm ప్రాసెస్‌పై స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 12జీబీ వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది.
ఫోటోగ్రఫీ పరంగా చూస్తే..
ఈ ఫోన్లో జైస్-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో కెమెరా (100x డిజిటల్ జూమ్), 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
పవర్ పరంగా పరిశీలిస్తే..
వివో ఎక్స్300ఇలో 7,200mAh బ్యాటరీ ఉంది. 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్-సి, NavIC, జీపీఎస్ ఉన్నాయి. ఈ ఫోన్లో ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్ కూడా ఉంది. ఈ హ్యాండ్సెట్ బరువు సుమారుగా 199.5 గ్రాములు, మందం 7.79mm ఉంటుంది.
