Mayor Salary In AP : ఏపీలో మేయర్ నుంచి సర్పంచ్ వరకు.. ఎవరికి ఎంత జీతం వస్తుందో తెలుసా..? పూర్తి వివరాలు ఇవే..
Mayor Salary In AP : మేయర్, మున్సిపల్, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అందించే నెలవారీ గౌరవ వేతనాలపై వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Mayor Salary In AP
Mayor Salary In AP : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తికానుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అందించే నెలవారీ గౌరవ వేతనాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్ ఇలా.. కార్పొరేటర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుడి వరకు ఎవరికి ఎంత గౌరవ వేతనం అందుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
Also Read : AP Municipal Election Winners : ఏపీలో ఏకగ్రీవమైన మున్సిపాలిటీలు ఇవే.. విజయం సాధించిన అభ్యర్థులు వీరే..
ప్రజాప్రతినిధుల జీతాలు ఇలా..
♦ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే.. మేయర్‌కు రూ.30వేలు జీతం ఉంటుంది. డిప్యూటీ మేయర్‌కు రూ.20వేలు, కార్పొరేటర్‌కు రూ.6వేలు జీతం ఉంటుంది.
♦ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు 50వేలకుపైగా జనాభా ఉంటే నెలకు రూ.19,500 వేతనంగా ఇస్తారు. అదే 50వేలలోపు జనాభా ఉంటే వారికి రూ.15,600 జీతం ఇస్తారు. డిప్యూటీ ఛైర్‌పర్సన్‌కు 50వేలకుపైగా జనాభా ఉంటే నెలకు రూ.9,750 జీతం ఇస్తారు.. అదే 50వేల జనాభాలోపు ఉంటే వారికి రూ.6,500 వేతనం ఇస్తారు. కౌన్సిలర్లకు 50వేల జనాభాపైన ఉన్నవారికి రూ.4,550 జీతంగా అందిస్తారు.. అదే 50వేలలోపు జనాభా ఉన్నవారికి రూ.3,250 గౌరవ వేతనంగా అందిస్తారు.
♦ జిల్లా పరిషత్ నుంచి పంచాయతీ వరకు ప్రజాప్రతినిధుల జీవితాలను పరిశీలిస్తే.. జెడ్పీ ఛైర్మన్‌కు రూ.40వేలు జీతం, జెడ్పీటీసీకి నెలకు రూ.6వేలు జీతం ఉంటుంది. ఎంపీపీకి రూ.6వేలు, ఎంపీటీసీకి రూ.3వేలు జీతం ఇస్తారు. పంచాయతీల విషయానికి వస్తే సర్పంచ్‌కు వేతనం నెలకు రూ.3వేలు ఉంటుంది.. వార్డు సభ్యులకు వేతనం ఉండదు.

