IPL 2027 : ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్ న్యూస్.. రిటెన్షన్ గడువు మరో రెండు రోజులు పొడిగింపు!
IPL 2027 : ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం గోవా వేదికగా డిసెంబర్ 16న జరగనున్న సంగతి తెలిసిందే.
IPL 2027 Retention Deadline Extended For 2 days
IPL 2027 : ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం గోవా వేదికగా డిసెంబర్ 16న జరగనున్న సంగతి తెలిసిందే. కాగా వేలానికి ముందు ఫ్రాంచైజీలకు బీసీసీఐ స్వల్ప ఊరటనిచ్చింది. ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల జాబితాలను సమర్పించేందుకు గడువును మరో రెండు రోజులు పొడిగించింది. నవంబర్ 15గా నిర్ణయించిన గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు సమాచారం. దీంతో కొత్త గడువు నవంబర్ 17గా మారింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదో వన్డే మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది. అదే రోజున రిటెన్షన్ జాబితాల గడువు ఉండటంతో ప్రకటనకు సంబంధించిన మీడియా కవరేజీపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గడువును రెండు రోజులు పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి.
Rohit Sharma : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డులు ఇవే..
రిటెన్షన్, విడుదల జాబితాలను సమర్పించిన తర్వాత ఐపీఎల్ యాజమాన్యం నమోదు చేసుకున్న ఆటగాళ్ల వివరాలను ఫ్రాంచైజీలకు అందిస్తుంది. అనంతరం జట్లు తమకు అవసరమైన ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేస్తాయి. వేలానికి వారం ముందు తుది ఆటగాళ్ల జాబితాతో పాటు వేలం జరిగే క్రమాన్ని ప్రకటిస్తారు.
2028లో మెగా వేలం..
ప్రస్తుత ఐపీఎల్ సైకిల్లో 2027 వేలం చివరి మినీ వేలం కానుంది. 2028 సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ మెగా వేలంతో పాటు ఐపీఎల్ తదుపరి మీడియా హక్కుల చక్రం కూడా ప్రారంభం కానుంది. అయితే.. కొత్త మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఇంకా టెండర్‌ను విడుదల చేయలేదు.
2022లో ఐపీఎల్ మీడియా హక్కులు రూ.48,390.5 కోట్లకు (సుమారు 6.2 బిలియన్ డాలర్లు) అమ్ముడయ్యాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా టోర్నమెంట్లలో ఐపీఎల్ ఒకటిగా నిలిచింది.
