Poco M8 Power Launch : వారెవ్వా.. పోకో M8 పవర్ ఫోన్ కిర్రాక్ అంతే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు బ్యాటరీ లైఫ్ పక్కా..!
Poco M8 Power Launch : పోకో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. వచ్చే ఆగస్టులో భారత మార్కెట్లో పోకో M8 పవర్ ఫోన్ లాంచ్ కానుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. పూర్తి వివరాలివే..

Poco M8 Power Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? చైనా ఫోన్ మేరక్ షావోమీ సబ్-బ్రాండ్ పోకో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. వచ్చే నెల ఆగస్టులో భారత మార్కెట్లో పోకో M8 పవర్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఏడాది జనవరిలో పోకో M8 లాంచ్ అయింది. ఇప్పుడు ఈ సంస్థ పోకో M8 పవర్ పేరుతో మరో ఫోన్ తీసుకువస్తోంది. దీనికి సంబంధించి కీలక స్పెసిఫికేషన్లు కూడా రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,000mAh బ్యాటరీ ఉంటుంది.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో పోకో M8 పవర్ సంబంధించి వివరాలతో మైక్రోసైట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 4న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. పోకో M8 పవర్లో అమోల్డ్ స్క్రీన్ ఉంటుంది. రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ ఉంది.

బ్యాక్ కెమెరా యూనిట్లో పోకో బ్రాండింగ్‌తో పాటు 2 కెమెరాలు, సింగిల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,000mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ 3 రోజుల వరకు వస్తుందని పోకో పేర్కొంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో రివీల్ అయింది. పోకో M8 పవర్ ఇతర స్పెసిఫికేషన్లను ఇంకా ప్రకటించలేదు. ఇటీవల చైనాలో లాంచ్ అయిన రెడ్మి నోట్ 17 రీబ్రాండెడ్ వెర్షన్ గా భారత మార్కెట్లో లాంచ్ కానుందని నివేదికలు సూచించాయి. రెడ్మి నోట్ 17 కూడా త్వరలో అతి త్వరలో లాంచ్ కానుంది.

ఈ ఫోన్ చైనాలో 7-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,396 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ లెవల్స్ ఉన్నాయి. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్, అడ్రినో జీపీయూతో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ఓఎస్ 3పై రన్ అవుతుంది.

రెడ్మి నోట్ 17 బ్యాక్ సైడ్ రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్లో ఎఫ్/1.8 అపర్చర్, ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50MP సింగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1,080p/30fps వరకు వీడియోను రికార్డ్ చేయొచ్చు.

ఫ్రంట్ సైడ్ సెన్సార్లలో ఇ-కంపాస్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. రెడ్మి నోట్ 17 ఫోన్ 8,000mAh బ్యాటరీ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
