WhatsApp Web Tricks : వాట్సాప్‌ వెబ్‌లో ఈ సూపర్ షార్ట్‌కట్స్‌.. తప్పక తెలుసుకోండి!

ప్రముఖ మెసేంజర్ వాట్సాప్‌ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటికే వాట్సాప్ అందించిన సూపర్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

WhatsApp Web Keyboard shortcuts : ప్రముఖ మెసేంజర్ వాట్సాప్‌ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటికే వాట్సాప్ అందించిన సూపర్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఏయే ఫీచర్ ఎలా వినియోగించుకోవాలో చాలామందికి తెలియకపోవచ్చు. వాట్సాప్ మొబైల్ వెర్షన్, వాట్సాప్ వెబ్ డెస్క్ టాప్ వెర్షన్ రెండింటిలోనూ అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ వెబ్ యూజర్లు ఏదైనా ఓపెన్ చేయాలంటే ప్రతిసారి ఆయా ఫీచర్లను ఒక్కొక్కటిగా వెతకాల్సి వస్తోంది. ఇకపై ఆ ఇబ్బంది అక్కర్లేదు. ఏదైనా ఫీచర్ వేగంగా ఓపెన్ చేసేందుకు సూపర్ (keyboard shortcuts) షార్ట్ కట్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ వెబ్‌లో టిప్స్ అండ్ ట్రిక్స్ చాలామందికి తెలియకపోవచ్చు. ఆ షార్ట్ కట్స్ ఏంటి… వాటిని వాట్సాప్ వెబ్‌లో ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

WhatsApp Web Keyboard shortcuts : ఈ షార్ట్ కట్స్ పూర్తిగా తెలుసుకోవాలంటే.. ప్రొఫైల్ దగ్గర మూడు నిలువు చుక్కలపై క్లిక్ చేయండి. Settings లోకి వెళ్లండి. Keyword Shortcuts ఆప్షన్ క్లిక్ చేయండి.. మొత్తం లిస్ట్ కనిపిస్తుంది.

Settings : వాట్సాప్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాంటే.. ఫస్ట్ మెనూ (menu)లోకి వెళ్లాలి. సెట్టింగ్స్‌పై Click చేయాలి. అలా కాకుండా డైరెక్ట్‌గా సెట్టింగ్స్‌కు వెళ్లాలంటే Ctrl+Alt+ నొక్కండి చాలు..

Mute : ఏదైనా గ్రూప్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ మ్యూట్‌ చేయాలా? Ctrl+Alt+Shift+M నొక్కితే చాలు..

Profile& About : యూజర్‌ ప్రొఫైల్‌ అండ్‌ About సెక్షన్‌కు వెళ్లాలంటే.. Ctrl+Alt+P క్లిక్‌ చేయాలి.

Archive Chat : డెస్క్‌టాప్‌లో ఏదైనా గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాటింగ్‌ Archive మరింత ఈజీ. Ctrl+Alt+E నొక్కితే చాలు..

Mark As Unread : వాట్సాప్‌ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్‌ ఓపెన్‌ చూస్తుంటాం.. సెండర్ పంపిన మెసేజ్ చూసినట్టు తెలిసిపోతుంది. మెసేజ్‌ను చూడకుండానే చదివేయొచ్చు.. Ctrl+Alt+Shift+U క్లిక్‌ చేయండి.. అప్పుడు అది Unread మోడ్‌ ఛేంజ్ అయిపోతుంది.

Search Chat ‌: వాట్సాప్‌ గ్రూపుల్లోని చాటింగ్‌ సెక్షన్‌లో చేసుకోవచ్చు కదా.. చాటింగ్ సెక్షన్‌ ఓపెన్ చేయాలంటే మౌస్ తో సెర్చ్ ఐకాన్ పై క్లిక్ చేస్తాం. కానీ, అందుకు ఒక షార్ట్ కట్ ఉంది.. Ctrl+Alt+Shift+F క్లిక్‌ చేస్తే సరి..

Pin Chat ‌: వాట్సాప్‌ గ్రూపుల్లో మీకు నచ్చిన చాట్ ముందు కనిపించాలంటే పిన్‌ చాట్‌ చేసుకోవచ్చు. ఇది తెలిసిందే.. అయితే దీనికి షార్ట్‌కట్‌ ఉంది.. Ctrl+Alt+Shift+P నొక్కితే చాలు.. చాట్ పిన్ అయిపోతుంది.

New Group, New Chat : కొత్తగా గ్రూప్‌ క్రియేట్‌ చేయాలంటే.. Ctrl+Alt+Shift+N క్లిక్‌ చేయండి. న్యూ చాట్‌ కోసం Ctrl+Alt+N ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

Exit Group : ఏదైనా గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోవాలంటే గ్రూప్‌లోని 3 చుక్కలపై క్లిక్‌ చేసి ఎగ్జిట్‌ గ్రూప్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. Ctrl+Alt+Backspace పర్సనల్ చాట్‌లో మెసేజ్‌లను క్లియర్‌ చేసుకోవచ్చు.


KeyWord Shortcut keys List : 

Ctrl + Alt + Shift + U: Mark as unread
Ctrl + Alt + Shift + M: Mute
Ctrl + Alt + E: Archive chat
Ctrl + Alt + Backspace: Delete chat
Ctrl + Alt + Shift + P: Pin chat
Ctrl + Alt + / (forward slash): Search
Ctrl + Alt + Shift + F: Search chat
Ctrl + Alt + N: New chat
Ctrl + Alt + Shift + N: New group
Ctrl + Alt + P: Profile and About
Ctrl + Alt + , (comma): Settings

చాట్ బాక్సులో టెక్స్ట్ హైలెట్ చేయాలంటే :

Bold: (*) .. మీ టెక్స్ట్ కు రెండువైపులా  స్టార్ (*text*) ఉండాలి.
Italic: (_).. మీ టెక్స్ట్‌కు రెండువైపులా అండర్ స్వ్కైర్ (_text_) ఉండాలి.
Strikethrough: tilde (~) టెక్స్ట్ కు రెండువైపులా ఈ సింబల్ (~text~) పెట్టాలి.
Monospace:  (“`)  మీ మెసేజ్ కు రెండువైపులా (“`text“`) ఈ మూడు బ్యాక్ టిక్స్ పెట్టాలి.

Chat Wallpaper Color :
–  Whatsapp Menu ఓపెన్ చేయండి.
– ప్రొఫైల్ దగ్గర 3 వర్టికల్ డాట్స్ పై నొక్కండి
Settings పై క్లిక్ చేయండి.
Chat Wallpaper పై క్లిక్ చేయండి.
color tile సెలక్ట్ చేసుకోండి.
WhatsApp Doodles remove చేయాలంటే UnCheck చేస్తే సరిపోతుంది.

Read Also : Evaru Meelo Koteeswarulu: మహేష్ ఎపిసోడ్‌‌కి ముహూర్తం ఫిక్స్.. టీఆర్పీలు బద్దలే!

ట్రెండింగ్ వార్తలు