AI Plus Nova 2 Pro 5G : AI+ నోవా 2 ప్రో 5జీ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 48MP AI కెమెరాతో జూన్ 22నే లాంచ్.. ధర చాలా చీప్..?

AI Plus Nova 2 Pro 5G : ఏఐ ప్లస్ నోవా 2 ప్రో 5జీ ఫోన్ జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కొనేసుకోవచ్చు.

AI Plus Nova 2 Pro 5G

  • ఏఐ ప్లస్ నోవా 2 ప్రో 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ సేల్
  • ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంటుంది
  • బ్యాక్ సైడ్ డ్యూయల్ ఏఐ కెమెరా, 6000mAh బ్యాటరీ సెటప్

AI Plus Nova 2 Pro 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఏఐ ప్లస్ నోవా 2 ప్రో 5జీ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ వచ్చే వారం భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కంపెనీ నోవా 2 ప్రో 5జీ రిలీజ్ తేదీని టీజ్ చేసింది. ప్రత్యేకించి ఈ ఏఐ ప్లస్ నోవా 2 ప్రో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది.

టీజర్‌తో పాటు కంపెనీ కొన్ని కీలక స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించింది. ఈ ఫోన్‌లో భారీ డిస్‌ప్లే, అతిపెద్ద బ్యాటరీ ఉంటాయి. అలాగే, అనేక ఏఐ ఫీచర్లకు సపోర్టుతో డ్యూయల్ ఏఐ కెమెరా ఉంటుంది. ఏఐ ప్లస్ నోవా 2 ప్రో 5జీ ఫోన్ లాంచ్, కీలక ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.

భారత్‌లో ఏఐ+ నోవా 2 ప్రో 5జీ లాంచ్ తేదీ :
కంపెనీ Ai+ నోవా 2 ప్రో 5జీ లాంచ్ తేదీని ధృవీకరించింది. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ సంబంధించిన టీజర్‌ కూడా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ జూన్ 22న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ లభ్యం కానుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా కొనేసుకోవచ్చు. టీజర్‌తో పాటు కంపెనీ పలు స్పెసిఫికేషన్లను కూడా రివీల్ చేసింది.

Read Also : Redmi Turbo 5 First Sale : కొత్త రెడ్‌మి టర్బో 5 ఫస్ట్ సేల్ దుమ్మురేపుతోంది! బ్యాంక్ ఆఫర్లతో బంపర్ డిస్కౌంట్లు.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు!

భారత్‌లో Ai+ నోవా 2 ప్రో 5G ధర (అంచనా) :
భారత మార్కెట్లో Ai+ నోవా 2 ప్రో 5జీ ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఈ ఫోన్ ధర రూ. 12వేల నుంచి రూ. 15వేల మధ్య ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ 4GB నుంచి 6GB వరకు ర్యామ్, 128GB లేదా 256GB వరకు స్టోరేజ్‌తో అనేక వేరియంట్లలో లభిస్తుందని అంచనా. కంపెనీ ఈ ఫోన్‌ను పింక్, బ్లాక్, సీ గ్రీన్ వంటి పలు కలర్ ఆప్షన్లలో అందించే అవకాశం ఉంది.

ఏఐ ప్లస్ నోవా 2 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు :
ఏఐ ప్లస్ నోవా 2 ప్రో 5జీ ఫోన్ అద్భుతమైన స్పెసిఫికేషన్లను కంపెనీ టీజర్‌లో వెల్లడించింది. ఈ ఫోన్‌లో 6.9-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది. బ్యాక్ సైడ్ కంపెనీ స్మార్ట్ లైట్స్ అనే స్పెషల్ ఫీచర్‌ అందిస్తోంది.

అయితే, ఫస్ట్ టైమ్ ఈ ఫోన్‌లోనే ఫీచర్ రాబోతుంది. వివిధ కలర్ ఆప్షన్లలో లైట్లు ఉంటాయి. మ్యూజిక్‌తో సింక్ చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఇందులో నాలుగు A78 కోర్లు 2.4GHz వద్ద 4 A55 కోర్లు 2.0GHz వద్ద క్లాక్ అయ్యాయి.

ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ ఏఐ కెమెరా సెటప్‌తో వస్తుంది. స్పెషల్ ఏఐ ఫీచర్లతో వస్తుంది. మెయిన్ లెన్స్ 48MP కెమెరా, ఇందులో సోనీ IMX 582 సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 13MP ఏఐ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.