Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. అతి తక్కువ ధరకే 3 రీఛార్జ్ ప్లాన్‌లు.. రోజుకు 2GB డేటా..!

Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం రోజువారీ 2GB డేటాతో పాటు 3 రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఏది కావాలో మీరే ఎంచుకోండి..

Airtel Recharge Plan

Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. దేశీయ రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్.. తమ వినియోగదారుల కోసం అద్భుతమైన 3 రీఛార్జ్ ప్లాన్లను (Airtel Recharge Plan) ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో తర్వాత దేశంలో అత్యధిక సంఖ్యలో మొబైల్ యూజర్ ఎయిర్‌టెల్‌ వాడుతున్నారు.

ఎయిర్‌టెల్ అందించే ఈ ప్లాన్లలో లాంగ్ వ్యాలిడిటీ నుంచి షార్ట్ వ్యాలిడిటీ వరకు తక్కువ డేటా నుంచి ఎక్కువ డేటా వరకు రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 2GB డేటాతో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. మీరు ఎయిర్‌టెల్ యూజర్ అయితే ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లలో నచ్చిన ప్లాన్ ఎంచుకోండి..

ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 2GB డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Read Also : Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఫోన్ మీ సొంతం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

ఎయిర్‌టెల్ రూ.649 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.649 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 2GB డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.1029 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.1029 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.