Airtel Rs 199 vs Rs 185 Plan : ఎయిర్‌టెల్ రూ.185 రీఛార్జ్ బెటరా? రూ.199 ప్లాన్‌ బెటరా? ఏ ప్లాన్‌తో ఎక్కువ బెనిఫిట్స్..!

Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం ప్రస్తుతం తక్కువ ధరలో రూ.185, రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Airtel Rs 199 vs Rs 185 Plan

  • ఎయిర్‌టెల్ రూ. 185 రూ. 199 రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు
  • రూ. 199 ప్లాన్ కేవలం రూ. 14 అదనంగా చెల్లిస్తే అదనపు బెనిఫిట్స్
  • రూ. 185 ప్లాన్ వాయిస్ కాల్స్, రూ. 199 ప్లాన్‌లో బెనిఫిట్స్

Airtel Rs 199 vs Rs 185 Plan : ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఎయిర్‌టెల్ అందించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో రూ.185, రూ.203, రూ.206 వాయిస్ ఓన్లీ ప్లాన్లతో పాటు, రూ.199 ప్రీపెయిడ్ ప్యాక్ కూడా పొందవచ్చు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో రూ.185 లేదా రూ.199 ప్లాన్లలో ఏది తీసుకుంటే బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రూ.185 ప్లాన్‌తో బెనిఫిట్స్ ఇవే :
తక్కువ ధరలో కేవలం కాలింగ్ కోసం ఎయిర్‌టెల్ రూ.185 రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ప్యాక్ ద్వారా 28 రోజుల పాటు లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్‌ను అన్‌లిమిటెడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు వ్యాలిడిటీ ముగిసే వరకు మొత్తం 300SMS బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Google Pixel 11 : ఏంది భయ్యా డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 11 భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..!

అదనంగా హలోట్యూన్స్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌కు రోజుకు సగటున రూ.6.61 ఖర్చవుతుంది. మొబైల్ డేటా అవసరం లేకుండా ప్రధానంగా ఫోన్ కాల్స్ కోసం సిమ్‌ను వాడేవారికి అద్భుతమైన ఆప్షన్..

రూ.199 ప్లాన్‌లో అదనపు బెనిఫిట్స్ :
రూ.14 ఎక్కువ చెల్లించి రూ.199 ప్లాన్‌ను ఎంచుకుంటే అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులోనూ 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. అయితే, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు మొత్తం 2GB డేటా కూడా లభిస్తుంది.

ఇంకా ఎయిర్‌టెల్ అందించే అదనపు డిజిటల్, సేఫ్టీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో ఎయిర్‌టెల్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ఎక్స్‌ట్రీమ్ ప్లే, సేఫ్ నెట్‌వర్క్, హలోట్యూన్స్ ఉన్నాయి. అయితే, అదనపు సేవలకు సంబంధించిన అర్హతలు, నిబంధనలను రీఛార్జ్‌కు ముందే చెక్ చేయడం బెటర్..

ఏ ప్లాన్ ఎంచుకోవాలి? :
కేవలం కాల్స్ కోసం రూ.185 ప్లాన్‌ తీసుకోవచ్చు. కానీ, అప్పుడప్పుడు ఇంటర్నెట్ వాడటం, రోజువారీ ఎస్ఎంఎస్‌లు పంపడం, అదనపు సర్వీసుల కోసం రూ.199 ప్యాక్ అందిస్తుంది. మొత్తంగా కేవలం రూ.14 అదనంగా చెల్లించి డేటా, రోజువారీ ఎస్ఎంఎస్‌లు, ఇతర బెనిఫిట్స్ కోసం రూ.199 ప్లాన్ తీసుకోండి. ఈ ప్లాన్ లభ్యత, ఆఫర్లను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను చెక్ చేసుకోండి.